https://oktelugu.com/

బిజెపి ఆశలు వమ్ము చేస్తున్న రజనీకాంత్!

దక్షిణాదిన బలం పెంచుకోవాలని గత ఐదేళ్లుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేక పోవడంతో తమిళనాడులో రజనీకాంత్, ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ వంటి వారిని దగ్గరకు తీసుకొని ఆయా రాష్ట్రాలలో బలమైన పార్టీగా ఎదగాలని ప్రయత్నిస్తున్న బిజెపికి తమిళ సూపర్ స్టార్ రజని కాంత్ పెద్ద షాక్ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లకు కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన చేయడంతో తమకు దూరంగా జరగాలని రజనీకాంత్ నిర్ణయించుకున్నట్లు బిజెపి గ్రహించింది. దానితో ఆయనపై […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 28, 2020 / 05:10 PM IST
    Follow us on

    దక్షిణాదిన బలం పెంచుకోవాలని గత ఐదేళ్లుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేక పోవడంతో తమిళనాడులో రజనీకాంత్, ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ వంటి వారిని దగ్గరకు తీసుకొని ఆయా రాష్ట్రాలలో బలమైన పార్టీగా ఎదగాలని ప్రయత్నిస్తున్న బిజెపికి తమిళ సూపర్ స్టార్ రజని కాంత్ పెద్ద షాక్ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లకు కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన చేయడంతో తమకు దూరంగా జరగాలని రజనీకాంత్ నిర్ణయించుకున్నట్లు బిజెపి గ్రహించింది. దానితో ఆయనపై పెట్టుకున్న ఆశలు వమ్ము అయిన్నట్లే.

    తమిళనాడు బీజేపీకి అధ్యక్షురాలు తమిళిసైని తెలంగాణ గవర్నర్ గా పంపిన తర్వాత ఇంకా ఆ పార్టీ పార్టీ అధ్యక్షుడిని బిజెపి నియమించలేదు. రజనీకాంత్ వస్తే ఆ పదవి ఇవ్వడం కోసం ఎదురు చూస్తున్నది. రాజకీయ ప్రవేశం గురించి ప్రకటించి మూడేళ్లు అవుతున్నా ఇప్పటి పార్టీ పేరు కూడా ప్రకటించని రజనీకాంత్ 2022 అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారిస్తున్నట్లు అందరికి తెలిసిందే. అందుకనే ఆయనను బీజేపీలో చేర్చుకోవాలని చూస్తున్నారు. పలువురు బిజెపి నాయకులు ఆయనతో చర్చలు జరుపుతూనే ఉన్నారు.

    పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు ప్రకటించడమే కాకుండా, జాతీయ పౌరసత్వ నమోదు వల్ల ముస్లింలకు నష్టం కలుగదని, ముస్లింలకు ముప్పు కలిగితే అందరి కంటే ముందు తానే వారికి అండగా నిలబడతానని కూడా రజనీకాంత్‌ ప్రకటించారు. దానితో బీజేపీలో చేరకపోయినా తమతో పొత్తు పెట్టుకుంటారని, ఎన్డీయేలో చేరతారని బిజెపి నాయకులు ధీమాగా ఉన్నారు.

    అయితే జయలలిత మృతి సమయంలో రాజ్ భవన్ కేంద్రంగా అక్కడ తమ అదుపాజ్ఞలలో ఉండే ప్రభుత్వం ఏర్పాటుకోసం కేంద్రంలోని బిజెపి నాయకులు చేసిన రాజకీయాలు తమిళ్ ప్రజలలో ఆ పార్టీ పట్ల తీవ్ర వైముఖ్యాన్ని కలిగించాయి. తమిళుల ఆత్మగౌరవాన్ని బిజెపి తీవ్రంగా గాయపరిచిందనే అభిప్రాయం కలుగుతున్నది. అందుకనే ఆ పార్టీతో పొత్తు రాజకీయంగా తీవ్రమైన వ్యతిరేకతను కలిగించగలదని రజనీకాంత్ గ్రహించినట్లు కనబడుతున్నది.

    దానితో సొంతంగా పోటీ చేయడమో, లేదా మిత్రుడు కమల్‌హాసన్‌ నాయక త్వంలోని మక్కల్‌ నీదిమయ్యంతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు రజనీకాంత్ సిద్దపడుతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఏవైనా ఈ పరిణామాలు తమిళనాడులో బలం పుంజుకోవాలనుకొనే బిజెపి ఆశలకు విఘాతం కలిగించినట్లే.