‘మిషన్‌‌‌‌ కాకతీయ’ కు మంగళం

తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చెప్పుకొంటూ వస్తున్న `మిషన్ కాకతీయ’ పథకంకు ఇక మంగళం పాడారు. ఈ పధకం కింద ఇకపై పనులేవీ చేపట్టవద్దని నిర్ణయించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్‌‌‌‌ మౌఖికంగా ఆదేశాలిచ్చినట్టు తెలుస్తున్నది. చెరువులు, కుంటల్లో పూడిక తీసి నీటి నిల్వలు పెంచాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ పధకం రాష్ట్రంలో కొంత మేర ప్రయోజనం కలిగించింది. రానురాను నిధుల విడుదలలో జాప్యం కారణంగా కొన్నాళ్లు నత్తనడకగా నడుస్తుండగా, ఇప్పుడు మొత్తంగా మంగళం పాడారు. […]

Written By: Neelambaram, Updated On : February 25, 2020 4:50 pm
Follow us on

తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చెప్పుకొంటూ వస్తున్న `మిషన్ కాకతీయ’ పథకంకు ఇక మంగళం పాడారు. ఈ పధకం కింద ఇకపై పనులేవీ చేపట్టవద్దని నిర్ణయించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్‌‌‌‌ మౌఖికంగా ఆదేశాలిచ్చినట్టు తెలుస్తున్నది.

చెరువులు, కుంటల్లో పూడిక తీసి నీటి నిల్వలు పెంచాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ పధకం రాష్ట్రంలో కొంత మేర ప్రయోజనం కలిగించింది. రానురాను నిధుల విడుదలలో జాప్యం కారణంగా కొన్నాళ్లు నత్తనడకగా నడుస్తుండగా, ఇప్పుడు మొత్తంగా మంగళం పాడారు.

ప్రస్తుత నిర్ణయంతో వివిధ దశల్లో ఉన్న 5,553 చెరువుల పనులు ఆగిపోయాయని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో 46,531 చెరువులు, కుంటలున్నట్టు 2014లో నిర్వహించిన మైనర్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ శాఖ చేపట్టిన లెక్కల్లో తేలింది. మిషన్‌‌‌‌ కాకతీయ పథకంకు రూపకల్పన చేసినప్పుడు ఏటా 9,300 చెరువుల్ని బాగుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఐదేళ్లలో మొత్తం చెరువులు, కుంటల్లో పూడిక తీసి, కట్టలు, తూములు బలోపేతం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే పధకం అమలుకు వచ్చేసరికి కేవలం 27,625 చెరువుల పనులకే పరిపాలనా ఆమోదం ఇచ్చారు. వాటిని 4 విడతల్లో బాగు చేస్తామని చెప్పారు. వాటిలో 26,989 చెరువులు బాగు చేసేందుకు రూ.9,125 కోట్లు కేటాయించారు.

మిషన్‌‌‌‌ కాకతీయ మొదటి డతలో మంజూరుఅయిన చెరువుల పనులు దాదాపుగా పూర్తి పూర్తి య్యాయి. ఈ విడతలో శాంక్షన్‌‌‌‌ ఇచ్చిన వాటిలో కేవలం 20 చెరువుల పనులే పెండింగ్‌‌‌‌ ఉన్నాయి.రెండో విడతలో అత్యధిక చెరువుల పనులకు అనుమతులు ఇచ్చినా ఇంకా వెయ్యికిపైగా చెరువుల పనులు పెండింగ్‌‌‌‌లోనే ఉన్నాయి.

మూడో విడతకు వచ్చే సరికే పనుల్లో వేగం తగ్గింది. నిధులు ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం చూపడంతో కేవలం 65 శాతం పనులే పూర్తి అయ్యాయి. నాలుగో విడతకు వచ్చేసరికి పధకం పూర్తిగా పక్కకుపోయింది. ఈ విడతలో కేవలం 40 శాతం పనులే చేశారు.

మొత్తంగా అన్ని విడతల్లో కలిపి మంజూరు చేసిన నిధుల్లో సగం కూడా ఖర్చు చేయలేదు. ఫిబ్రవరి మొదటి వారం వరకు మిషన్‌‌‌‌ కాకతీయలో రూ.4,352.18 కోట్ల పనులు చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇందులో రూ.450 కోట్ల బిల్లులు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి.

నాలుగు విడతల్లో మంజూరు చేసిన వాటిలో 5,553 చెరువులు, కుంటల పనులు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. నిధుల కొరత ఉందని, ఇక వాటి జోలికెళ్లొద్దని అధికారులను సీఎం కేసీఆర్‌‌‌‌ ఆదేశించినట్టు తెలిసింది.

ఎక్కడైనా పది శాతం, అంతకన్నా కొంచెం అటుఇటుగా పనులు పెండింగ్‌‌‌‌లో ఉంటే ఈ ఎండాకాలంలో పూర్తి చేయాలని, అంతకుమించి పనులున్న చెరువులను వదిలేయాలని సూచించినట్టు సమాచారం. కేవలం 100లోపు చెరువుల్లోనే పది శాతంలోపు పనులు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయని, వాటిని ఈ ఎండాకాలంలో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.