ఎల్వి ఆర్ ఎస్ ఎస్ ను తప్పుదోవ పుట్టించారా!

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వి సుబ్రహ్మణ్యం ను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తొలగించడానికి ప్రధాన కారణం ఆర్ ఎస్ ఎస్ మద్దతు కోసం ప్రభుత్వం `హిందూ వ్యతిరేక, క్రైస్తవ అనుకూల’ పద్దతులలో పనిచేస్తున్నదని సృష్టించిన కథనాలను వ్యాప్తి చేయడమే అని తెలుస్తున్నది. ఆ కథనాలను నమ్మి, ఆర్ ఎస్ ఎస్ సీనియర్ నేతలు సహితం జగన్ ప్రభుత్వంపై ఆగ్రవేశాలు వ్యక్తం చేసి, ఎల్వికి కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవి ఇప్పించడం కోసం విఫల ప్రయత్నం […]

Written By: Neelambaram, Updated On : March 3, 2020 11:45 am
Follow us on

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వి సుబ్రహ్మణ్యం ను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తొలగించడానికి ప్రధాన కారణం ఆర్ ఎస్ ఎస్ మద్దతు కోసం ప్రభుత్వం `హిందూ వ్యతిరేక, క్రైస్తవ అనుకూల’ పద్దతులలో పనిచేస్తున్నదని సృష్టించిన కథనాలను వ్యాప్తి చేయడమే అని తెలుస్తున్నది.

ఆ కథనాలను నమ్మి, ఆర్ ఎస్ ఎస్ సీనియర్ నేతలు సహితం జగన్ ప్రభుత్వంపై ఆగ్రవేశాలు వ్యక్తం చేసి, ఎల్వికి కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవి ఇప్పించడం కోసం విఫల ప్రయత్నం చేసారని చెబుతున్నారు.

అయితే ఎస్వీ సుబ్రహ్మణ్యం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుర్కొంటున్న అవినీతి సీబీఐ కేసులలో సహనిందితుడు కావడంతో, ఆర్ ఎస్ ఎస్ మద్దతుతో ఆ కేసుల నుండి బైట పడాలని ఈ ఎత్తుగడ వేసారని అధికార వర్గాలలో అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.

ఎల్వికి అనుకూలంగా ఉండే వ్యక్తులు పలువురు ఆయనను త్వరలో నీతి ఆయోగ్ కార్యదర్శిగా మోదీ ప్రభుత్వం నియమించబోతున్నట్లు విశేషంగా ప్రచారం కూడా జరపడం ఈ సందర్భంగా ఆసక్తి కలిగిస్తున్నది.

కానీ, వాస్తవానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అతనిని ప్రాసిక్యూట్ చేయడానికి సీబీఐకి అనుమతి ఇచ్చింది. అయితే దానిపై హై కోర్ట్ నుండి స్టే తెచ్చుకున్నారు. ఎప్పటికైనా ఈ స్టే ను హై కోర్ట్ ఖాళీ చేసి, సిబిఐ కేసులలో ఎల్వి సుబ్రమణ్యంను విచారింపక తప్పదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కేసు ఉండగా ఆయనను కేంద్ర సర్వీస్ లోకి తీసుకొనే అవకాశమే లేదని కూడా చెబుతున్నారు.

టిటిడి చైర్మన్ గా నియమితులైన ముఖ్యమంత్రి బాబాయి వై వి సుబ్బారెడ్డి హిందువు కాదని, క్రైస్తవుడని అంటూ ఆర్ ఎస్ ఎస్ సీనియర్ నాయకులకు సుబ్రహ్మణ్యం సన్నిహితులే చేరవేశారని, ఈ విషయమై తర్వాతనే రసభ జరిగినదని బీజేపీ లోని కీలక వర్గాలు తెలిపాయి. వాస్తవానికి సుబ్బారెడ్డి ధార్మికత కలిగిన హిందువే అని బిజెపి వర్గాలు సహితం అంగీకరిస్తున్నాయి.

అదే విధంగా జగన్ పాలనలో తిరుమలలో సిలువ బొమ్మ ఉంచారనే ప్రచారం కూడా ఎల్వి సన్నిహిత వర్గాల నుండే బయలుదేరిన్నట్లు తెలుస్తున్నది. ఒక మొబైల్ టవర్ లో పరికరాలను మరమ్మతుకు తీసుకు వెళ్ళినప్పుడు అక్కడున్న స్తంభంలో సిలువ ఆకారంలో కనిపించే కడ్డీల ఫోటో తీసే ఈ దుష్ప్రచారం సాగించారని వెల్లడైనది.

మరోవంక దేవాలయ భూములను పేదలకు ఇండ్లస్థలాల కోసం ఇవ్వాలని జగన్ చెప్పారని, తాడికొండ ఎమ్యెల్యే మతం గురించి తలెత్తిన వివాదంపై ఆమె క్రైస్తవురాలని నివేదిక ఇవ్వమని తాను జిల్లా కలెక్టర్ కు చెప్పడం ముఖ్యమంత్రి జగన్ కు ఆగ్రహం కలిగించాయని వంటి పలు సృష్టించిన కథనాలను ఆర్ ఎస్ ఎస్ నాయకులకు చేరవేయడం కూడా ముఖ్యమంత్రికి ఆగ్రహం కలిగించినట్లు చెబుతున్నారు.

తామెంతో గౌరవం ఇచ్చి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చేస్తే, కేవలం తనపై సిబిఐ కేసు లేకుండా చేసుకోవడం కోసం తన ప్రభుత్వంపైననే అసత్యాలు ప్రచారం చేయడాన్ని ముఖ్యమంత్రి తట్టుకోలేక పోయిన్నట్లు అధికార పక్షానికి చెందిన వర్గాలు చెబుతున్నాయి.