
కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 62దేశాలకు విస్తరించిన కరోనా భారత్ లో కూడా ప్రవేశించింది. దేశంలో కొత్తగా రెండు కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని అధికారులు నిన్న వెల్లడించడంతో ప్రజలు భయాంధోళనలకు గురౌతున్నారు. కరోనా సోకిన ఒక వ్యక్తిది తెలంగాణ కావడంతో వైరస్ రాకుండా తీసుకోవాలన జాగ్రత్తల పైన ప్రజలు దృష్టి కేంద్రీకరించారు. ఈ కరోనా రక్కసిని నివారించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ 10 ప్రాథమిక వ్యక్తిగత నివారణ చర్యలను సూచించింది. వీటిని పాటిస్తే మీకు కరోనా వైరస్ సోకదని వివరించింది.
ఈ మేరకు డబ్యూహెచ్ ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ సాధారణ మార్గదర్శకాలను ప్రకటించారు. ఆ పది కరోనా వైరస్ రాకుండా చేసే నివారణ చర్యలు
- ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవడం.. కలుషితమైన పరిసరాలు అనారోగ్య వ్యక్తులను తాకిన తర్వాత ముఖంతో సహా వైరస్ వ్యాప్తి చెందే అన్నింటిని శుభ్రంగా కడుక్కోవాలి. దీని ద్వారా ప్రమాదాన్ని తగ్గింవచ్చు.
- చాలా మందికి ముక్కు కారడం.. జ్వరం పొడిదగ్గుతో ప్రారంభమవుతాయి. తేలికపాటి వ్యాధిలా కనిపిస్తుంది. శ్రద్ధ తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం.
- జ్వరం దగ్గు వచ్చినప్పుడు ప్రయాణాలకు దూరంగా ఉండండి. విమానం లో రైలు సహా ప్రయాణం లో అనారోగ్యానికి గురైతే ఇంటికి వచ్చాక ఆరోగ్యనిపుణులతో పరీక్ష చేయించండి.
- దగ్గు తుమ్మినప్పుడు కర్ఛీఫ్ లు వాడండి. వాటిని వాడాక చెత్త డబ్బాలో వేయండి. చేతులు శుభ్రం చేసుకోండి
- 60ఏళ్లు పైబడిన వారు గుండె శ్వాసకోశ డయాబెటిస్ రోగులకు ఇది త్వరగా వచ్చి ప్రాణాలు తీస్తుంది. రద్దీగా ఉండే ప్రాంతాలు అనారోగ్యంతో ఉండేవారితో దూరంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి
- అనారోగ్యానికి గురైన వారు సమాజంలో తిరగవద్దు ఇంట్లో ఆస్పత్రులలో ఒంటరిగా ఉండాలి. ఎవరిని కలవకపోతే బెటర్. ఇతరులకు సోకకుండా సహాయపడుతుంది.
- అనారోగ్యానికి గురైనప్పుడు ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యుల నుంచి విడిగా ఉండండి. ఎక్కువగా నిద్రించండి.. తినడానికి వివిధ పాత్రలు పరికరాలు వేరుగా వాడండి.
- శ్వాస తీసుకోవడం కష్టమవడం.. ఊపిరి ఆడకపోవడం కరోనా ప్రధాన లక్షణం.. ఇలా అయితే వెంటనే వైద్యులను వెంటనే సంప్రదించండి
- క్రిమిసంహారక మందులతో క్రమం తప్పకుండా ఉపరితలాలు కిచెన్ బెంచీలు పనిచేసే చోటున చల్లి శుభ్రం చేయాలి.
- కరోనా సోకిన ప్రదేశాలు ప్రాంతాల్లో పర్యటించాల్సి వచ్చినప్పుడు తప్పని సరిగా మాస్కులు గ్లౌజులు ధరించండి.. కార్యాలయాలు పాఠశాల ప్రార్థనాస్థలాలకు వెళ్లకుండా ఉంటే మంచిది.
వదంతులు, తప్పుడు ప్రచారాలు, పుకార్లు నమ్మకుండా ధైర్యంగా ఉంటె ఏ వ్యాధినైనా నయం చేసుకోవచ్చని డబ్యూహెచ్ ఓ ఒక ప్రకటనలో తెలిపింది.