మందుల కంపెనీల ముడుపులకు ఐటి మినహాయింపులా!

తమ కంపెనీ మందులనే అవసరం ఉన్నా లేక పోయినా రోగులకు వ్రాసి తమకు లాభాలు తెచ్చిపెట్టమని ఔషధ కంపెనీలు డాక్టర్లను ప్రలోభాలకు గురిచేస్తూ ఉండటం అందరికి తెలిసింది. అందుకు ప్రతిఫలంగా డాక్టర్లకు నగదు పారితోషికంతో పాటు ఖరీదైన బహుమతులు, విలాసవంతమైన పర్యటనలు ఏర్పాటు చేస్తుంటాయి. ఇటువంటి ఖర్చులు అన్ని అనైతికం, డాక్టర్లకు ముడుపులు చెల్లించడంగానే పరిగణించాలి. అయితే దేశంలో ప్రముఖ ఔషధ కంపెనీలు అన్ని అటువంటి ఖర్చులను `సేల్స్ ప్రమోషన్’ వ్యయంగా చూపి, అందుకోసం ఆదాయపన్ను మినహాయింపులు […]

Written By: Neelambaram, Updated On : February 26, 2020 2:49 pm
Follow us on


తమ కంపెనీ మందులనే అవసరం ఉన్నా లేక పోయినా రోగులకు వ్రాసి తమకు లాభాలు తెచ్చిపెట్టమని ఔషధ కంపెనీలు డాక్టర్లను ప్రలోభాలకు గురిచేస్తూ ఉండటం అందరికి తెలిసింది. అందుకు ప్రతిఫలంగా డాక్టర్లకు నగదు పారితోషికంతో పాటు ఖరీదైన బహుమతులు, విలాసవంతమైన పర్యటనలు ఏర్పాటు చేస్తుంటాయి. ఇటువంటి ఖర్చులు అన్ని అనైతికం, డాక్టర్లకు ముడుపులు చెల్లించడంగానే పరిగణించాలి.

అయితే దేశంలో ప్రముఖ ఔషధ కంపెనీలు అన్ని అటువంటి ఖర్చులను `సేల్స్ ప్రమోషన్’ వ్యయంగా చూపి, అందుకోసం ఆదాయపన్ను మినహాయింపులు కోరుతూ వస్తున్నాయి. కొన్ని ఔషధ కంపెనీలు అనుసరిస్తున్న ఇటువంటి అనైతిక చర్యలపై విచారణ జరపడం కోసం స్వయంగా మద్రాస్ హైకోర్టు రంగంలోకి దిగింది.

2019–20 ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 8,667 ఫార్మా కంపెనీలు ‘సేల్‌‌ ప్రమోషనల్‌‌ వ్యయం’, ‘బహుమతులు’ ల కింద ఆదాయపన్ను మినహాయింపును క్లయిమ్‌‌ చేశాయని ఐటీ శాఖ మద్రాస్‌‌ హైకోర్టుకు వివరించింది. 2019–20కి గాను 1,410 కంపెనీలు ఐటీఆర్‌‌ (ఇన్‌‌కమ్‌‌ ట్యాక్స్‌‌ రిటర్న్‌‌)‌‌ 3 ద్వారా, 1,915 కంపెనీలు ఐటీఆర్‌‌‌‌ 5 ద్వారా, 5,342 కంపెనీలు ఐటీఆర్‌‌ 6 ‌‌ ద్వారా ‘సేల్‌‌ ప్రమోషన్‌‌ వ్యయం’, ‘బహుమతులు’ కింద పన్ను మినహాయింపును క్లయిమ్‌‌ చేశాయని కోర్టు ఫిబ్రవరి 17 న ఇచ్చిన ఆర్డర్‌‌‌‌లో పేర్కొంది.

ఈ ఆర్డర్‌‌‌‌ను ఎన్‌‌ కిరుబకరన్‌‌, పీ వెలమురగన్‌‌తో కూడిన బెంచ్‌‌ ఇచ్చింది. సేల్‌‌ ప్రమోషన్‌‌ ఖర్చులు, లైసెన్స్‌‌ ఖర్చులు ఆదాయపన్ను నుంచి మినహాయించాలని క్లయిమ్‌‌ చేయడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని కోర్టు ఆ ఆర్డర్‌‌‌‌లో పేర్కొంది. డాక్టర్స్‌‌కి నగదు, బహుమతులు ఇవ్వడం కేవలం లంచమివ్వడంతో సమానమని కోర్టు వ్యాఖ్యానించింది.

ఫార్మా కంపెనీలు ఇప్పటికి కూడా డాక్టర్లకు బహుమతులు ఇవ్వడం, ప్రయాణ సదుపాయాలు కల్పించడం, నగదు ఇవ్వడం జరుగుతుందని వ్యాఖ్యానించింది. కంపెనీలు చట్టవిరుద్ధంగా మందుల ధరాల్నయూ పెంచడం కూడా నిజమని పేర్కొంది.

‘సేల్‌‌ ప్రమోషనల్‌‌ వ్యయం’, ‘బహుమతులు’ కింద ఆదాయపన్ను మినహాయింపును క్లయిమ్‌‌ చేసిన కంపెనీలు, ఓవర్‌‌‌‌ ప్రైసింగ్‌‌ చేయడం వలన జరిమానాలు కట్టిన కంపెనీల వివరాలను సమర్పించాలని కోర్టు ఆదాయపన్ను శాఖను ఆదేశించింది. ఫార్మా కంపెనీలు అనైతిక విధానాలను అనుసరిస్తున్నాయని గతంలో కూడా ఆరోపణలొచ్చాయి. పన్ను చెల్లింపులో భాగంగా ఓ ఫార్మా కంపెనీకి, ఐటీ శాఖకు మధ్య విభేదాలు చెలరేగడంతో ఈ వార్తాలొచ్చాయి.