చిచ్చుపెట్టిన కరోనా.. కేసీఆర్ తో గవర్నర్ ఫైట్?

బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చాక ఉత్సవ విగ్రహాల్లాంటి గవర్నర్ పదవులకు గొప్ప బలమొచ్చింది. వారు ప్రభుత్వాలను కూల్చేసే శక్తియుక్తలను పొందారు. అంతేకాదు.. ఏకంగా సీఎంలను డమ్మీలను చేసి ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకునేదాకా ఎదిగారు. ఇప్పటికే గవర్నర్ల ద్వారా ఎన్నో ప్రభుత్వాలను కూల్చేసిన బీజేపీ.. తమకు కొరకరాని కొయ్య అయిన తెలంగాణ సీఎం కేసీఆర్ పై కూడా ఫైర్ బ్రాండ్ అయిన గవర్నర్ తమిళిసైని దించింది. చంద్రబాబుకి పచ్చకామెర్లు.. పవన్ కి కాదు! తమిళిసై ఆదినుంచి బీజేపీకి […]

Written By: NARESH, Updated On : July 8, 2020 3:11 pm
Follow us on


బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చాక ఉత్సవ విగ్రహాల్లాంటి గవర్నర్ పదవులకు గొప్ప బలమొచ్చింది. వారు ప్రభుత్వాలను కూల్చేసే శక్తియుక్తలను పొందారు. అంతేకాదు.. ఏకంగా సీఎంలను డమ్మీలను చేసి ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకునేదాకా ఎదిగారు. ఇప్పటికే గవర్నర్ల ద్వారా ఎన్నో ప్రభుత్వాలను కూల్చేసిన బీజేపీ.. తమకు కొరకరాని కొయ్య అయిన తెలంగాణ సీఎం కేసీఆర్ పై కూడా ఫైర్ బ్రాండ్ అయిన గవర్నర్ తమిళిసైని దించింది.

చంద్రబాబుకి పచ్చకామెర్లు.. పవన్ కి కాదు!

తమిళిసై ఆదినుంచి బీజేపీకి వీర భక్తురాలు.తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉండేవారు. ఇప్పుడు బీజేపీ ఆశీస్సులతో తెలంగాణకు గవర్నర్ అయ్యారు. అందుకే వీలు దొరికినప్పుడల్లా తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఇరుకునపెట్టడానికి వెనుకాడడం లేదు. తాజాగా మరో సారి తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో లేని వేళ పాలన పగ్గాలు చేతిలోకి తీసుకోవాలని ఉన్నత స్థాయి సమీక్షకు నిర్ణయించారు. కానీ కేసీఆర్ ముందే అలెర్ట్ అయ్యి ఆ సమీక్షను భగ్నం చేసి తమిళిసైకి చెక్ పెట్టారు. ఇలా తెలంగాణ ప్రభుత్వ పాలనలోకి రావాలనుకున్న తమిళిసై వైఖరితో ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నాడని టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలిసింది.

కరోనా ఇప్పుడు తెలంగాణలో కోరలు చాస్తోంది. హైదరాబాద్ లో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై సోషల్ మీడియా ద్వారా గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేశారు. ఇక గాంధీలో వైద్యం సరిగా చేయకపోవడం.. తెలంగాణ సర్కార్ టెస్టులను చేయకపోవడంపై చాలా మంది సోషల్ మీడియా ద్వారా గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేశారు. దీంతో గవర్నర్ తమిళిసై… కేసీఆర్ సర్కార్ వైద్యం విషయంలో నిర్లక్ష్యంపై స్వయంగా రంగంలోకి దిగారు. ప్రభుత్వ పాలనను చేతుల్లోకి తీసుకున్నారు. కరోనాపై చర్చించేందుకు ఏకంగా ఉన్నత స్థాయి సమీక్ష తలపెట్టారు. సీఎస్, హెల్త్ కార్యదర్శిని సమీక్షకు రాజ్ భవన్ కు రమ్మన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో లేని సమయంలో ఇదంతా జరిగింది.

ఈ రకమైన కరోనా కేసులు ప్రమాదకరం!

పాలనను గవర్నర్ తమిళిసై చేజిక్కించుకోవడం.. గవర్నర్ సమీక్ష నిర్వహిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఆలోచనతో కేసీఆర్ సర్కార్ అలెర్ట్ అయ్యింది. గవర్నర్ తలపెట్టిన సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హాజరు కాకుండా అడ్డుకుంది. వీరిద్దరూ గవర్నర్ సమీక్షకు గైర్హాజరు కావడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

రాజ్ భవన్ పిలుపునిచ్చినా తాము ముందే నిర్ధేశించుకున్న ఇతర సమావేశాల్లో బిజిగా ఉన్నందున హాజరు కాలేమని సీఎస్, హెల్త్ కార్యదర్శి.. గవర్నర్ కు సమాచారమిచ్చారు. ఆ సమీక్షకు వెళ్లకుండా తెలంగాణ సీఎంవోనే చక్రం తిప్పిందని ప్రచారం జరుగుతోంది. దీంతో గవర్నర్ అధికారాలు తీసుకోవాలని చూసిన ప్రయత్నాలకు కేసీఆర్ చెక్ పెట్టారు. ఇప్పుడు గవర్నర్, కేసీఆర్ మధ్య టామ్ అండ్ జెర్రీ ఫైట్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.