కరోనా ఎఫెక్ట్.. రంగంలోకి గవర్నర్ తమిళిసై

తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. రోజుకురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. ఇప్పటికే రాష్ట్రంలో 25వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వీరిలో 14వేలమంది కరోనా నుంచి కోలుకోగా 306మంది మృతిచెందారు. గడిచిన నాలుగైదు రోజులుగా ప్రతిరోజు వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా మహమ్మరి కోరలు చాస్తుండటంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీలో మంత్రి పదవి కోసం ఇన్ని కుట్రలా? తెలంగాణ ప్రభుత్వం కరోనా […]

Written By: Neelambaram, Updated On : July 7, 2020 10:59 am
Follow us on


తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. రోజుకురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. ఇప్పటికే రాష్ట్రంలో 25వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వీరిలో 14వేలమంది కరోనా నుంచి కోలుకోగా 306మంది మృతిచెందారు. గడిచిన నాలుగైదు రోజులుగా ప్రతిరోజు వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా మహమ్మరి కోరలు చాస్తుండటంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీలో మంత్రి పదవి కోసం ఇన్ని కుట్రలా?

తెలంగాణ ప్రభుత్వం కరోనా విషయంలో చేతులేత్తేసిందనే విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. ప్రభుత్వం నిరక్ష్యంగా కారణంగా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయని విపక్షాలు ఆరోపణలు గుప్పిపిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా ఇంతలా విజృంభిస్తున్నా సీఎం కేసీఆర్ కొద్దిరోజులుగా ఫౌంహౌజ్ కే పరిమితమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. ఈ తరుణంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆరా తీయడం చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్రంలో పరిస్థితి చేయిదాటకముందే గవర్నర్ కలగజేసుకోవాలని విపక్షాలు గతంలోనే కోరాయి. తెలంగాణ కరోనా టెస్టులు తక్కువ చేస్తున్నారని గవర్నర్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతోపాటు పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తమిళిసై కరోనా పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఈ అంశంపై చర్చించేందుకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, హెల్త్‌ సెక్రటరీని రావాల్సిందిగా ఆదేశించారు. అయితే మంగళవారం వస్తామని రాజ్ భవన్ కు విన్నవించారు.

చంద్రబాబుకి పచ్చకామెర్లు.. పవన్ కి కాదు!

కరోనా రోగుల నుంచి ప్రైవేట్ ఆస్పతులు అడ్డగోలుగా ఫీజులను వసూలు చేస్తున్నాయనే విమర్శలు నేపథ్యంలో గవర్నర్‌ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. మంగళవారం 11గంటలకు రాజ్ భవన్లో అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే గవర్నర్ ట్వీటర్లో వేదిక అరగంటపాటు నెటిజన్ల నుంచి అభిప్రాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి హైదరాబాద్లో లేని సమయంలో గవర్నర్ అధికారులతో సమీక్ష నిర్వహించడం ఆసక్తిని రేపుతోంది. ఈ సమావేశం తర్వాత గవర్నర్ ఎలాంటి విషయాలు వెల్లడిస్తారో వేచి చూడాల్సిందే..!