https://oktelugu.com/

జగన్ వర్సెస్ జడ్జీలు.. ఏడాదంతా న్యాయ పోరాటమే!

“మా ప్రభుత్వాన్ని హైకోర్టు ఇబ్బందులకు గురిచేస్తోంది. సుప్రీం కోర్టులోని ఓ న్యాయమూర్తి హైకోర్టును ప్రభావితం చేస్తున్నారు” అంటూ.. ఏపీ సీఎం జగన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లేఖ రాశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే.. ఈ లేఖపై ఇంకా సీజేఐ ఎలాంటి నిర్ణయమూ ప్రకటించ లేదు. కానీ.. జడ్జీలతో జగన్ పోరాటం మాత్రం బహిర్గతమైంది. Also Read: బాబ్బాబు.. తిట్టండయ్యా మమ్మల్నే :బీజేపీ ఈ ఏడాది ఇంతే.. ఏపీలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 14, 2020 / 03:39 PM IST
    Follow us on

    CM Jagan
    “మా ప్రభుత్వాన్ని హైకోర్టు ఇబ్బందులకు గురిచేస్తోంది. సుప్రీం కోర్టులోని ఓ న్యాయమూర్తి హైకోర్టును ప్రభావితం చేస్తున్నారు” అంటూ.. ఏపీ సీఎం జగన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లేఖ రాశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే.. ఈ లేఖపై ఇంకా సీజేఐ ఎలాంటి నిర్ణయమూ ప్రకటించ లేదు. కానీ.. జడ్జీలతో జగన్ పోరాటం మాత్రం బహిర్గతమైంది.

    Also Read: బాబ్బాబు.. తిట్టండయ్యా మమ్మల్నే :బీజేపీ

    ఈ ఏడాది ఇంతే..
    ఏపీలో వైసీపీ భారీ మెజారిటీ సాధించింది. కానీ.. ప్రభుత్వం తీసుకునే పలు నిర్ణయాలను సవాల్ చేస్తూ.. విపక్ష టీడీపీ నేతలతోపాటు పలువురు ప్రత్యర్ధులు హైకోర్టు మెట్లు ఎక్కడం పరిపాటిగా మారింది. వీటిలో మెజారిటీ తీర్పులు ప్రభుత్వానికి ప్రతికూల రావడంతో సీఎం జగన్‌కు భంగపాటు తప్పలేదు. ఈ ఏడాది మొత్తం ప్రతికూల తీర్పులు కొనసాగడంతో సీఎం జగన్.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీరమణతోపాటు హైకోర్టులోని పలువురు న్యాయమూర్తులపై సుప్రీంకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌కు లేఖ రాశారు. అంతేకాకుండా దాన్ని బహిర్గతం చేశారు. ఈ విషయం సంచలనం సృష్టించింది.

    Also Read: ఏపీ కొత్త సీఎస్ ఆయనే.. జగన్ కీలక నిర్ణయం?

    ఆలోచనల అమలుకు అడ్డంకి..
    భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటికీ ఏ కీలక నిర్ణయం కూడా స్వేచ్ఛగా తీసుకోలేని పరిస్ధితుల్లోకి జారి పోయింది వైసీపీ ప్రభుత్వం. ప్రజలకు మేలు చేసే విప్లవాత్మక సంస్కరణలు అయినా, పార్టీకి మేలు చేసే నిర్ణయమైనా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. ఈ పరిస్థితికి.. హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వందల సంఖ్యలో దాఖలైన పిటిషన్లు కూడా కారణం. వీటిని ఎదుర్కోవడంలోనే ప్రభుత్వానికి ఈ ఏడాది కాలం గడిచిపోయింది.

    సీజేఐకి జగన్‌ ఫిర్యాదుతో..
    హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. చాలా నిర్ణయాలు వస్తుండటంతో ప్రభుత్వ ప్రతిష్ట దిగజారింది. చిన్న చిన్న కేసుల్లో సైతం సీబీఐ దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వడం.. ప్రభుత్వం కోరుకున్న విధంగా వాటిపై స్టేలు ఇవ్వకపోవడం మరింత ఇబ్బందిగా మారింది. దీంతో.. కొందరు న్యాయమూర్తులు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కక్షగట్టారంటూ సీఎం జగన్‌ ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    హైకోర్టు దూకుడు పద్ధతి మారిందా..?
    సుప్రీం ఛీఫ్‌ జస్టిస్‌కు జగన్ లేఖ రాసిన నేపథ్యంలో హైకోర్టు కాస్త దూకుడు తగ్గించిందని పలువురు అంటున్నారు. గతంతో పోలిస్తే.. పలు కేసుల విచారణలో హైకోర్టు నుంచి తీవ్రమైన వ్యాఖ్యలు రావడం కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. ఇది ప్రభుత్వానికి కూడా ఇది కాస్త ఊరటనిచ్చే అంశమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    సీజేఐ ఏం చెప్తారో..?
    జగన్ లేఖ వ్యవహారంపై ఛీఫ్‌ జస్టిస్‌ ఎస్‌.ఏ బోబ్డే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సీజేఐ స్పందిస్తే తప్ప ఈ వ్యవహారం తేలదు. దీంతో.. ప్రభుత్వం కూడా చేసేది లేక మిన్నకుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుత సీజే బోబ్డే స్ధానంలో జగన్‌ సర్కారు ఆరోపణలు చేసిన జస్టిస్‌ ఎన్వీ రమణ వచ్చే ఏడాది ఏప్రిల్లో బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. మరి, ఈలోగా నిర్ణయం వెలువడుతుందా? లేకపోతే.. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అన్నది చూడాలి.