ఆంధ్రప్రదేశ్ రాజధానికి మా సపోర్టు అమరావతికేనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కేంద్ర బీజేపీ సైతం అమరావతికే మద్దతు ఇస్తుందని అన్నారు. ఇందుకు నిదర్శనంగా విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. జగన్ ప్రవేశపెట్టిన మూడురాజధానులపై తాము వ్యతిరేకంగానే ఉన్నామన్నారు. అలాగే మోదీ మనిషిగా చెబుతున్నా మా ఫుల్ సపోర్టు అమరావతికేనన్నారు. కాగా కర్నూలులో ఏర్పాటు చేసే హైకోర్టుకు సపోర్టు చేస్తున్నట్లు సోము వీర్రాజు అంతకుముందు తెలిపారు. అంతకుముందు అమరావతిలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికి బీజేపీ నాయకులు మూడు రాజధానుల విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా ఆ పార్టీ అధ్యక్షడు అమరావతినే రాజధానిగా ఉండాలని చెప్పడంతో సంచలనంగా మారింది.