జమిలీ ఎన్నికలతో కేసీఆర్ చంద్రబాబులు ఔటేనా?

దేశవ్యాప్తంగా మరోసారి జమిలీ ఎన్నికల అంశం హాట్‌టాపిక్‌ అయింది. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఫస్ట్‌ టర్మ్‌లోనే మోడీ జమిలీ ఎన్నికలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో అవి జాతీయ స్థాయి రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ఇక ఆ తర్వాత మోడీ మౌనంగా ఉండిపోయారు. జమిలీ ఎన్నికలపై ఎక్కడా పెద్దగా ప్రస్తావన తీసుకురాలేదు. ఇటీవల మరోసారి ఆ అంశాన్ని తెరపైకి తేవడంతో చర్చనీయాంశమైంది. మోడీ పాలన ఈ టర్మ్‌ ప్రకారం.. 2024లో లోక్‌సభ ఎన్నికలు వస్తాయి. […]

Written By: Srinivas, Updated On : December 17, 2020 9:56 am
Follow us on

దేశవ్యాప్తంగా మరోసారి జమిలీ ఎన్నికల అంశం హాట్‌టాపిక్‌ అయింది. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఫస్ట్‌ టర్మ్‌లోనే మోడీ జమిలీ ఎన్నికలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో అవి జాతీయ స్థాయి రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ఇక ఆ తర్వాత మోడీ మౌనంగా ఉండిపోయారు. జమిలీ ఎన్నికలపై ఎక్కడా పెద్దగా ప్రస్తావన తీసుకురాలేదు. ఇటీవల మరోసారి ఆ అంశాన్ని తెరపైకి తేవడంతో చర్చనీయాంశమైంది. మోడీ పాలన ఈ టర్మ్‌ ప్రకారం.. 2024లో లోక్‌సభ ఎన్నికలు వస్తాయి. కానీ.. ఒకవేళ ప్రధాని నిర్ణయం మేరకు జమిలీ ఎన్నికలు గానీ నిర్వహిస్తే 2022 లోనే ఎన్నికలు వస్తాయి.

Also Read: న్యాయవ్యవస్థలో భారీ కుదుపు..

అయితే.. మోడీ జమిలి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పూనకం వస్తుంటుంది. జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని.. పార్టీ క్యాడర్ సిద్ధంగా ఉండాలంటూ సూచనలు చేస్తుంటారు. మోదీతో పాటు కేంద్ర వ‌ర్గాల్లో జ‌మిలీపై ఎప్పటిక‌ప్పుడు చ‌ర్చలు న‌డుస్తున్న విష‌యం చంద్రబాబుకు కూడా ముందుగా లీక్ కావ‌డంతోనే ఆయ‌న త‌న పార్టీ శ్రేణుల‌ను అప్రమ‌త్తం చేస్తున్నారు. జ‌మిలీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో దేశంలో కొన్ని రాష్ట్రాల శాస‌న‌స‌భ‌ల కాల ప‌రిమితిని కుదించ‌డం, మ‌రికొన్ని రాష్ట్రాల కాల‌ప‌రిమితిని పెంచ‌డం కూడా చేస్తార‌ని టాక్.

మరోవైపు ఈ జమిలీ ఎన్నికలు ఇరు తెలుగు రాష్ట్రాల చంద్రుల పాలిట అమావాస్యలా మారనున్నాయట. ఈ ఎన్నికలతో వారి పొలిటికల్‌ కెరియర్‌‌కు బ్రేక్‌ పడనున్నట్లు నిపుణుల వాదన. ఎందుకంటే.. ఏపీలో చూస్తే ఇప్పటికీ జ‌గ‌న్ ప‌ట్ల ప్రజ‌ల్లో సానుకూల అభిప్రాయ‌మే ఉంది. చిన్నాచిత‌కా వ్యతిరేక‌త ఉన్నా అది జ‌గ‌న్‌ను అధికారం నుంచి దూరం చేసేంత స్థాయిలో లేదు. జ‌గ‌న్ సంక్షేమంపైనే ప్రధానంగా దృష్టి పెడుతూ పాల‌న కొన‌సాగిస్తున్నారు. ఏదో ఒక సంక్షేమ ప‌థ‌కం ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నారు. ఇక అమ‌రావ‌తి అంశం రాష్ట్రం అంతటా ఏ మాత్రం ప్రభావం చూప‌లేక‌పోతోంది.

మరోనేత చంద్రబాబు, ఆయ‌న త‌న‌యుడు హైద‌రాబాద్‌లోనే ఉంటూ రాజ‌కీయం చేస్తుండ‌డం, ఇటు టీడీపీ వాళ్లకు కూడా త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌న్న ఆశ‌లు లేక‌పోవ‌డం ఇలా ఎన్నో కార‌ణాలు జ‌గ‌న్‌కు సానుకూలంగానే ఉన్నాయి. జ‌గ‌న్ ఇదే పాజిటివ్ వేవ్‌ను మ‌రో ఏడాదిన్నర కంటిన్యూ చేస్తే జమిలీ ఎన్నికలు వచ్చినా ఆయనకు తిరుగుండదు. మ‌రో ఐదేళ్లు అధికారం ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఇక రాజ‌కీయంగా చ‌ర‌మాంక ద‌శ‌లో ఉన్న చంద్రబాబు మ‌రో ఏడేళ్ల త‌ర్వాత వ‌ర‌కు రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా ఉండి స‌త్తా చాటుతార‌ని ఆశించ‌డం అత్యాశే అవుతుంది. పైగా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో చంద్రబాబుకు పార్టీని అధికారంలోకి తేవ‌డం అసాధ్యమైన ప‌రిస్థితే.

Also Read: ముస్లింలు మమతకు జాగీర్లు కాదంటున్న ఎంఐఎం నేత..!

ఇక తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌కు కూడా జ‌మిలీ క‌ష్టాలు త‌ప్పేలా లేవు. కేసీఆర్ వ‌రుస‌గా రెండోసారి సీఎం అయ్యాక ఆయ‌న తీరులో మార్పు వ‌చ్చింద‌ని తెలంగాణ ప్రజానీక‌మే త‌మ ఓటుతో సమాధానం చెబుతున్నారు. మరోవైపు.. తెలంగాణలో అధికారం చేపట్టేందుకు బీజేపీ కాచుకుకూర్చుంది. తెలంగాణ ప్రజానీకానికి కూడా కేసీఆర్‌పై ఉన్న మ‌బ్బులు క్రమ‌క్రమంగా తొల‌గుతున్నాయ‌ని దుబ్బాక‌, తాజాగా గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఫ‌లితాలే రుజువు చేశాయి. అక్కడ టీఆర్ఎస్ గ్రాఫ్ శ‌ర‌వేగంగా పడిపోయింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కేసీఆర్ త‌న రాజ‌కీయ వార‌స‌త్వాన్ని కేటీఆర్‌కు ఇస్తే అది గులాబీ పార్టీలో పెను ముస‌లానికి కూడా దారితీయ‌డం.. దీనిని బీజేపీ మ‌రింతగా క్యాష్ చేసుకోవ‌డంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.

ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలను టార్గెట్‌ చేసిన బీజేపీకి.. ఈ రెండు రాష్ట్రాల కూడా బెల్లంలా మారాయి. ఒకవేళ తెలగాణలో కనుక ఆ పార్టీ పాగా వేస్తే బీజేపీ చేతుల్లో నుంచి అధికారం లాక్కోవ‌డం అంత స‌ులువు కాదు. ఈ విష‌యం తెలిసే కేసీఆర్ ఏం చేయ‌లేని ప‌రిస్థితుల్లో ఉడికిపోతున్నారు. కొడుకుకు రాష్ట్ర ప‌గ్గాలు అప్పగించి తాను జాతీయ రాజ‌కీయాల‌కు వెళ్లాల‌నుకుంటున్నా బీజేపీకి తానే ఛాన్స్ ఇచ్చిన‌ట్లు అవుతుంద‌న్న భ‌యం కూడా ఆయ‌న్ను వెంటాడుతోంది. మొత్తంగా చూస్తే జమిలీ ఎన్నికలు అటు చంద్రబాబుకు.. ఇటు చంద్రశేఖర్‌‌రావుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయనేది వాస్తవం.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్