ఇండియా పోస్ట్ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇండియా పోస్ట్ బ్యాంక్ అకౌంట్ ఉన్న కస్టమర్లు దేశంలోని ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు నిమిషాల్లో నగదు బదిలీ చేయవచ్చు. ఈ సర్వీసులను పొందాలనుకునే కస్టమర్లు తమ మొబైల్ ఫోన్ లో డాక్ పే అనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డిజిటల్ ఫైనాన్స్ సర్వీసులతో పాటు ఇండియా పోస్ట్ అందించే ఐపీపీబీ బ్యాంకింగ్ సేవలను ఈ యాప్ ద్వారా పొందవచ్చు.
Also Read: శుభకార్యాలకు ఆటంకం కలగకూడదంటే ఈ వ్రతం చెయ్యండి!
డాక్ పే యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న ఇండియా పోస్ట్ కస్టమర్లు యాప్ కు తమకు ఉన్న ఇతర బ్యాంక్ అకౌంట్లను కూడా లింక్ చేసుకోవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు డాక్ పే యాప్ సహాయంతో వ్యాపారులకు డిజిటల్ రూపంలో నగదు చెల్లించడం, క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం, ఇతరులకు సులభంగా డబ్బు పంపించడం చేయవచ్చు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ తో ఒప్పందం చేసుకుని ఇండియా పోస్ట్ కస్టమర్లకు ఈ సర్వీసులను అందిస్తోంది.
ఐపీపీబీ బోర్డు చైర్మన్ ప్రదీప్త కుమార్ ప్రతి భారతీయుని అవసరాలు తీర్చే విధంగా ఈ యాప్ రూపకల్పన చేశామని వెల్లడించారు. ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యాప్ లు అందిస్తున్న సర్వీసులన్నీ డాక్ పే యాప్ ద్వారా పొందవచ్చు. ఏకంగా 140 యాప్ లను ఖాతాకు లింక్ చేసుకునే అవకాశం ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్ ను సులభంగా ‘దౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Also Read: ఇంగ్లీష్ రాని వారికి శుభవార్త.. ఆన్ లైన్ లో రామకృష్ణ మఠం ఇంగ్లీష్ క్లాసులు..!
ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంక్ ఈ సర్వీసుల ద్వారా మరింత మంది ఖాతాదారులకు చేరువ కావాలనే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. తపాలా పొదుపు ఖాతా లేకపోయినా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా ఉంటే ఈ సేవలను పొందవచ్చు.