గుడ్ న్యూస్ చెప్పిన భారత్ బయోటెక్: ‘కోవాగ్జిన్‘ సురక్షితం..

కరోనా నివారణకు దేశవ్యప్తంగా అనేక కంపెనీలు వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ‘కోవాగ్జిన్’ పేరుతో వ్యాక్సిన్ ను సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా తుది ట్రయల్ నిర్వహించిన భారత్ బయోటెక్ దేశీయంగా ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదని స్పష్టం చేసింది. తొలి టీకా వేసిన తరువాత తలెత్తిన దుష్ప్రభావాలు ఎలాంటి మందులు అవసరం లేకుండా తగ్గిపోయాయని తెలిపింది. కాని ఇంజక్షన్ వేసిన […]

Written By: Suresh, Updated On : December 17, 2020 9:48 am
Follow us on

కరోనా నివారణకు దేశవ్యప్తంగా అనేక కంపెనీలు వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ‘కోవాగ్జిన్’ పేరుతో వ్యాక్సిన్ ను సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా తుది ట్రయల్ నిర్వహించిన భారత్ బయోటెక్ దేశీయంగా ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదని స్పష్టం చేసింది. తొలి టీకా వేసిన తరువాత తలెత్తిన దుష్ప్రభావాలు ఎలాంటి మందులు అవసరం లేకుండా తగ్గిపోయాయని తెలిపింది. కాని ఇంజక్షన్ వేసిన చోటనే కొద్దిగా నొప్పి ఏర్పడుతుందన్నారు. ఫేజ్ -1 ట్రయల్స్ మధ్యంతర ఫలితాల ప్రకారం టీగా రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుందని వివరించింది. తొలిదశకు సంబంధించిన మధ్యంతర ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు వ్యాక్సిన్ పంపిణీకి కావాల్సిన ఏర్పాట్లను ఆరోగ్యశాఖ సిద్ధం చేస్తోంది.