https://oktelugu.com/

 ఆంధ్రులూ.. తెగించాల్సిన టైం వచ్చింది!

ఉద్యమం నడిపించడంలో.. హక్కులను కొట్లాడి సాధించుకోవడంలో తెలంగాణ వాసులు చూపిన తెగువ మరెవరికీ సాధ్యం కాదేమో. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అది స్పష్టంగా కనిపించింది. కేంద్రం దిగొచ్చి రాష్ట్రాన్ని ప్రకటించింది. ఉమ్మడి రాష్ట్రంగానే కొనసాగించాలంటూ ఆంధ్రులు కొట్లాడినా పెద్దగా ఫలించలేదు. ఎందుకంటే వారిలో లోపించిన ఐక్యత అనే అందరూ చెబుతుంటారు. ఆంధ్రలో ఏదైనా ఉద్యమం ప్రారంభించామంటే అక్కడి వారే అడ్డుపుల్లలు వేస్తుంటారనేది టాక్‌. మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్ అంతేకాదు.. తెలంగాణ మాదిరి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2020 11:46 am
    Follow us on

    Andhras

    ఉద్యమం నడిపించడంలో.. హక్కులను కొట్లాడి సాధించుకోవడంలో తెలంగాణ వాసులు చూపిన తెగువ మరెవరికీ సాధ్యం కాదేమో. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అది స్పష్టంగా కనిపించింది. కేంద్రం దిగొచ్చి రాష్ట్రాన్ని ప్రకటించింది. ఉమ్మడి రాష్ట్రంగానే కొనసాగించాలంటూ ఆంధ్రులు కొట్లాడినా పెద్దగా ఫలించలేదు. ఎందుకంటే వారిలో లోపించిన ఐక్యత అనే అందరూ చెబుతుంటారు. ఆంధ్రలో ఏదైనా ఉద్యమం ప్రారంభించామంటే అక్కడి వారే అడ్డుపుల్లలు వేస్తుంటారనేది టాక్‌.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    అంతేకాదు.. తెలంగాణ మాదిరి వీధుల్లోకి వచ్చి గొడవ చేసే రకాలు కావు ఆంధ్రులు. అందుకే.. ఉమ్మడి రాష్ట్ర పోరు అయితేనేమీ.. ప్రత్యేక హోదా ఉద్యమం అయితేనేమీ ఎక్కడా ఫలితాలు సాధించలేకపోయింది. అప్పుడెప్పుడో 70 ఏళ్లకు పూర్వం పొట్టి శ్రీరాములు ప్రత్యేక రాష్ట్రం కోసం దీక్ష చేసి మరీ ఆంధ్రులకు తెచ్చిపెట్టారు. అప్పుడు కూడా మొదట్లో ఏపీలో చడీ చప్పుడూ లేదనే చరిత్ర చెబుతోంది.

    Also Read: పోలవరం.. ఎంతవరకు వచ్చింది?

    ఏ విధంగా చూసినా ఇప్పటికే ఆంధ్రులకు భారీ నష్టమే జరిగింది. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారు. ఇక ఢిల్లీ లాంటి రాజధానిని కట్టిస్తామని నాటి ప్రధాని అభ్యర్థిగా మోడీ చెప్పిన మాటలు సముద్రంలో కలిసిపోయాయి. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ దాన్ని తుంగలోకి తొక్కింది. విభజన చట్టం ప్రకారం కేంద్రం ఇచ్చిన హామీలకు దిక్కులేదు. ఏపీకి నిధుల సహాయం అంతకన్నా లేదు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌తో వివాదాలు అలాగే ఉన్నాయి. ఆర్టీసీ అస్తులు కథ తేలలేదు. ఉమ్మడి భవనాలు, ఇతర ఆస్తుల లెక్కలూ తేలలేదు. మరో వైపు జల వివాదాలూ అలాగే ఉన్నాయి. మళ్లీ ప్రారంభమయ్యాయి కూడా. అన్ని విధాలుగా అప్పుల కుప్పగా ఏపీ మారిపోయింది. దాని మీద మరో పెద్ద బండను వేస్తూ పోలవరం ఆశలను కూడా కేంద్రం తుంచేసింది.

    దీంతో ఏపీ ప్రజలు ఇప్పుడు బీజేపీ మీద కోపంతో ఊగిపోతున్నారట. హోదాపై డ్రామాలు అడినందుకు 2019 ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు ఇచ్చి పక్కన పెట్టారు. 2024లో అసలు ఏపీలో ఒక్క ఓటు కూడా బీజేపీకి రాకుండా చూడాలని ప్రచారం మొదలైపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీతో ఎవరు అంటుకుని ఉంటే వారికి కూడా రాజకీయంగా భారీ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు.

    Also Read: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పసుపు పార్టీ కనిపిస్తుందా..?

    చంద్రబాబు 2018లో బీజేపీతో విడిపోయారు. ఆయన నాటి నుంచి మోడీ, అమిత్ షాల మీద గట్టిగా విమర్శలు చేస్తూ జనంలోకి వెళ్ళినా కూడా బీజేపీతో నాలుగేళ్లు కలిసి ఉన్నారు. దీంతో గత ఎన్నికల్లో బాబుని పక్కనపెట్టేశారు. ఇప్పుడు జగన్ బీజేపీతో దోస్తీ చేస్తున్నారు. ఆయన నేరుగా కేంద్ర ప్రభుత్వంలో చేరకపోయినా మద్దతు ఇస్తున్నారు. ఇప్పటిదాకా కథ ఎలా నడచినా ఇక మీదట పోలవరం విషయంలో బీజేపీని కనుక జగన్ నిలదీయకపోతే ఆయనకు కూడా రాజకీయంగా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.