https://oktelugu.com/

Relationship Tips: అబ్బాయిలకు అలర్ట్.. అమ్మాయిలు అబ్బాయిలకు అస్సలు చెప్పని రహస్యాలివే!

Relationship Tips: ప్రతి రిలేషన్ షిప్ లో కొన్ని సీక్రెట్లు ఉంటాయి. ప్రతి ఒక్కరూ కొన్ని రహస్యాలను ఇతరులతో పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ముఖ్యంగా అమ్మాయిలు తాము ప్రేమించిన వ్యక్తులతో కూడా పంచుకోలేని కొన్ని సీక్రెట్లు ఉంటాయి. ఆశ్చర్యంగా అనిపించినా ప్రేమించిన అబ్బాయిలకు కొన్ని విషయాలను అమ్మాయిలు చెప్పడానికి ఇష్టపడరు. అబ్బాయిలు సైతం అమ్మాయిలతో ఈ విషయాల గురించి ఎక్కువగా చర్చించడం కరెక్ట్ కాదు. అబ్బాయిలు అమ్మాయిల గ్యాంగ్ చాట్ గురించి అస్సలు అడగకూడదు. అమ్మాయిలు తన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 16, 2022 / 04:49 PM IST
    Follow us on

    Relationship Tips: ప్రతి రిలేషన్ షిప్ లో కొన్ని సీక్రెట్లు ఉంటాయి. ప్రతి ఒక్కరూ కొన్ని రహస్యాలను ఇతరులతో పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ముఖ్యంగా అమ్మాయిలు తాము ప్రేమించిన వ్యక్తులతో కూడా పంచుకోలేని కొన్ని సీక్రెట్లు ఉంటాయి. ఆశ్చర్యంగా అనిపించినా ప్రేమించిన అబ్బాయిలకు కొన్ని విషయాలను అమ్మాయిలు చెప్పడానికి ఇష్టపడరు. అబ్బాయిలు సైతం అమ్మాయిలతో ఈ విషయాల గురించి ఎక్కువగా చర్చించడం కరెక్ట్ కాదు.

    Relationship Tips

    అబ్బాయిలు అమ్మాయిల గ్యాంగ్ చాట్ గురించి అస్సలు అడగకూడదు. అమ్మాయిలు తన స్నేహితులతో ఎన్నో విషయాలను పంచుకుంటారు. ఆ చాట్ గురించి కానీ తన స్నేహితుల సీక్రెట్ల గురించి కానీ అమ్మాయిలు స్నేహితులతో చాట్ చేసిన విషయాల గురించి చర్చను కానీ అస్సలు ఇష్టపడరు. అమ్మాయిలను ప్రేమించిన అబ్బాయిలు క్రష్ గురించి అడిగితే నిజాలు చెప్పరు.

    Also Read: AP Politics: ప‌వ‌న్‌కు టీడీపీ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిందా.. బీజేపీ రూట్ మ్యాప్ ఏంటి..?

    అమ్మాయిలకు హీరోలపై క్రష్ ఎలా ఉంటుందో వేరొకరిపై కూడా క్రష్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ విషయాలను కూడా అమ్మాయిలు అబ్బాయిలతో పంచుకోరు. అబ్బాయిలు అమ్మాయిల ఫ్రెండ్స్ జాబితాను తెలుసుకోవాలని ప్రయత్నిస్తే అలా చేయడం నచ్చదు. అమ్మాయికి ఎవరైనా అబ్బాయిలు ఫ్రెండ్స్ గా ఉంటే ఆ విషయాలను కూడా అమ్మాయిలు చెప్పరు. అమ్మాయిలకు అంతకు ముందే బ్రేకప్ అయ్యి ఉంటే మాజీ ప్రేమికుడి గురించి చర్చించడం సరికాదు.

    అమ్మాయిల జీవితంలో బాధ పెట్టే ఘటనలు ఉంటే ఆ విషయాల గురించి కూడా అబ్బాయిలు తెలుసుకునే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. అమ్మాయిలకు కొన్ని పదాలు అస్సలు నచ్చదు. అలాంటి పదాలు మాట్లాడితే కూడా అమ్మాయిలకు అస్సలు నచ్చదు. అమ్మాయిలతో మాట్లాడే సమయంలో అబ్బాయిలు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు.

    Also Read: RRR Fre Release Event: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం రంగంలోకి ముఖ్యమంత్రి.. ఇండియాలోనే ఇదో సంచలనం..