https://oktelugu.com/

RRR Movie Ram Charan NTR: వైరల్ అవుతున్న ‘ఎన్టీఆర్ – చరణ్’ ఫన్నీ ఇంటర్వ్యూ

RRR Movie Ram Charan NTR: నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్రబృందం ఫుల్ బిజీగా ఉంది. ఐతే, యూ- ట్యూబర్ భువన్ కు ఉన్న క్రేజ్ ఇంతా అంతా కాదు. బీబీ కీ వైన్స్ పేరుతో అతను నిర్వహిస్తున్న ఛానెల్ ను 25 మిలియన్ కు పైగా సబ్ స్కైబర్స్ ఫాలో […]

Written By:
  • Shiva
  • , Updated On : March 16, 2022 / 04:47 PM IST
    Follow us on

    RRR Movie Ram Charan NTR: నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్రబృందం ఫుల్ బిజీగా ఉంది. ఐతే, యూ- ట్యూబర్ భువన్ కు ఉన్న క్రేజ్ ఇంతా అంతా కాదు. బీబీ కీ వైన్స్ పేరుతో అతను నిర్వహిస్తున్న ఛానెల్ ను 25 మిలియన్ కు పైగా సబ్ స్కైబర్స్ ఫాలో అవుతున్నారు.

    RRR Movie Ram Charan NTR

    అతను చేసే ఫన్నీ ఇంటర్వ్యూలలో చిన్నపాటి సెటైర్ కూడా చోటు చేసుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లో భాగంగా హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, డైరెక్టర్ రాజమౌళితో చిన్న పాటి చిట్ చాట్ నిర్వహించాడు భువన్. ఆ వీడియో ప్రస్తుతం బాగా పేలుతుంది. వీడియోలో హీరోల పై అతను వేసిన జోక్స్ కూడా బాగా పేలాయి.

    ఇక ఈ క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి మరో ఘనత దక్కింది. ప్రీమియర్స్‌తో ఆర్ఆర్ఆర్ ఒకరోజు ముందుగా, అంటే మార్చి 24నే పలకరించనుంది. ఈ క్రమంలో ఏ చిత్రానికి లేనంత క్రేజీగా ప్రీమియర్‌ టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ట్రేడ్‌ వర్గాల ప్రకారం యూఎస్‌లో 867 లోకేషన్లలో 1535 షోస్‌కి అప్పుడే $1300k వచ్చేశాయట. ఈ సినిమా ప్రీ టికెట్‌ సేల్స్‌లో సంచలనం సృష్టించడం ఖాయం అంటున్నారు.

    Also Read: Prabhas with Krithi Shetty: కృతిశెట్టే కావాలంటున్న ప్రభాస్.. కారణం అదే

    ముఖ్యంగా చరణ్‌, తారక్‌ అభిమానులు ఒక్క టికెట్‌తో ఆగట్లేదట. ఒక్కొక్కరు రెండేసి టికెట్లు కొంటున్నారు. పైగా ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.

    RRR Movie

    ఇప్పటికే ఈ సినిమా నుంచి అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ఫస్ట్ లుక్ టీజర్, కొమురం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ టీజర్, మరియు ట్రైలర్ అండ్ సాంగ్స్ విడుదలైయి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయి. దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ ప్యాన్‌ ఇండియా మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.

    Tags