shortage of money: మనదేశంలో వాస్తుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల కాలంలో వాస్తు చూసుకున్నాకే అన్ని పనులు చేస్తున్నారు. వాస్తు శాస్త్ర రీత్యా అనేక విషయాలు జాగ్రత్తగా పరిశీలిస్తూ తమ ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ఇంటికే కాదు మనం వాడే వస్తువులకు కూడా వాస్తు ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మనం రోజు వాడే పర్సు కూడా వాస్తు ప్రకారమే వాడుకోవాలని చెబుతున్నారు. దీంతో పర్సు వినియోగంలో కూడా వాస్తు పద్ధతులు ఉంటాయని తెలుస్తోంది. పర్సు వాడకంలో కూడా పలు పద్ధతులు ఉంటాయని తెలిసిందే. దీంతోనే మనకు లక్ష్మి కటాక్షం కలుగుతుందని భావిస్తుంటారు.
పర్సు కలర్లలో కూడా వాస్తు దాగి ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు. వాయిలెట్ కలర్ లేదా నలుపు పర్సులను వాడాలి. ఇంకా పింక్, పసుపు కలర్ లు కూడా వాడొచ్చు. నీలం, ఎరుపు కలర్లను దూరంగా ఉంచడమే మంచిది. వాలెట్ కలర్ బాగా ఉపయోగపడుతుంది. మనకు నిత్యం పర్సులో డబ్బు నిలవాలంటే వాలెట్ లేదా నలుపు రంగులే వాడాలని తెలుస్తోంది. పర్సు వాడకంలో కూడా ఇన్ని నిబంధనలు ఉంటాయని తెలియక చాలా మంది ఏవేవో కలర్లు వాడుతూ తమ ఆర్థిక లాభాలు రాకుండా చేసుకుంటున్నారు. పర్సులో ఎప్పుడు కూడా డబ్బులు లేకుండా చేసుకోవద్దు. అందులో కనీసం రూపాయి అయినా ఉంచుకోవాల్సిందే. డబ్బు లేకుండా పర్సు ఉంచకూడదు. రూపాయి నోటు కూడా ఉంచుకోవచ్చు. కానీ ఇరవై రూపాయల నోటు మాత్రం ఉంచుకోవద్దు. ఇంకా వెండి నాణాన్ని కూడా ఉంచుకోవచ్చు. పర్సును ఖాళీగా ఉంచుకోవడం మంచి పద్ధతి కాదని తెలుస్తోంది. దీంతో పర్సు వినియోగంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేకపోతే మనకు ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.
పర్సును భద్రపరచే చోటు కూడా పరిశుభ్రతంగా ఉంచుకునేలా చూసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ పర్సును పెట్టకూడదు. ముఖ్యంగా బెడ్ మీద అసలు ఉంచకూడదు. ఇంకా డైనింగ్ టేబుల్ మీద ఎట్టి పరిస్థితిలో పడేయరాదు. పర్సును శుభ్రంగా ఉండే స్థలంలోనే ఉంచాలి. వాస్తు శాస్త్రం ప్రకారం పర్సులో లక్ష్మిదేవి ఫొటో లేదా శ్రీ వాస్తు యంత్రం ఉంచుకుంటే కూడా మేలు జరుగుతుంది. పర్సు వినయోగం కూడా వాస్తు ప్రకారం ఉంటేనే ప్రయోజనం ఉంటుంది. అందుకే దాని కలర్, అది ఉంచుకునే చోటు విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాల్సిందే.