Pawan Kalyan- Bandla Ganesh: ‘నా దైవ సమానులైన పవన్ గారూ.. బండ్ల క్రేజీ పోస్ట్ లు.. సినిమా ఫిక్స్ అయిందా ?

Pawan Kalyan- Bandla Ganesh: పవర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ కి అభిమానుల రూపంలో ఎంతమంది భక్తులు ఉన్నా సరే.. వారందరికంటే కూడా తానే పవర్ ఫుల్ భక్తుడ్ని అని బలంగా చెప్పుకుంటుంటాడు బండ్ల గ‌ణేష్. తాజాగా బండ్ల మరోసారి ట్వీట్స్ రూపంలో పవన్ పై తన అభిమానాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఇంతకీ బండ్ల గణేష్ ఏం ట్వీట్స్ పెట్టాడో చూద్దాం రండి. ‘నా దైవ సమానులైన మా ⁦పవన్ కళ్యాణ్ గారు.. ⁩ మీరు తెలుగు […]

Written By: Shiva, Updated On : August 6, 2022 4:35 pm
Follow us on

Pawan Kalyan- Bandla Ganesh: పవర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ కి అభిమానుల రూపంలో ఎంతమంది భక్తులు ఉన్నా సరే.. వారందరికంటే కూడా తానే పవర్ ఫుల్ భక్తుడ్ని అని బలంగా చెప్పుకుంటుంటాడు బండ్ల గ‌ణేష్. తాజాగా బండ్ల మరోసారి ట్వీట్స్ రూపంలో పవన్ పై తన అభిమానాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఇంతకీ బండ్ల గణేష్ ఏం ట్వీట్స్ పెట్టాడో చూద్దాం రండి.

Pawan Kalyan- Bandla Ganesh

‘నా దైవ సమానులైన మా ⁦పవన్ కళ్యాణ్ గారు.. ⁩ మీరు తెలుగు చలన చిత్ర చరిత్రలో రికార్డులు తిరగరాసే సినిమా త్వరగా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బండ్ల గణేష్’ అని ఒక ట్వీట్ పెట్టాడు. అనంతరం మరో ట్వీట్ చేస్తూ.. ‘పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని ప్రేమిస్తూ మీ ప్రేమను పొందుతూ సినిమా తీస్తే బాక్స్ బద్దలే’ అని ఒక మెసేజ్ పెట్టాడు.

Also Read: Deepika Padukone: సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్.. ‘దీపికా పడుకోణె’కి ఏమైంది ?

ఎప్పటి నుంచో బండ్ల గణేష్ నిర్మాతగా పవన్ తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం పవర్ స్టార్ కోసం కథను వెతికే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు. బండ్ల గణేష్ కి ఇప్పటికే పవన్ డేట్స్ ఇస్తానని చెప్పడంతో.. బండ్ల సీరియస్‌ గా కథల పై పడ్డాడు. బండ్ల కథ వెతికే క్రమంలో ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ దర్శకులు, రైటర్స్‌ ను కలుస్తున్నాడట.

అయినా పవన్ ఇమేజ్‌ కు సరిపోయే కథను మాత్రం ఎవరూ చెప్పట్లేదట. అందుకే, పవన్ కి సరిపోయే కథను సిద్ధం చేయండి అంటూ రచయితలను దర్శకులను రిక్వెస్ట్ చేస్తున్నాడు బండ్ల గణేష్. కథ ఫైనల్ అయిన తర్వాత.. ఇక పవన్ తో చేయబోయే సినిమా వివరాలు బయటికి చెప్తానంటున్నాడు బండ్ల గణేష్. ఈ క్రమంలోనే బండ్ల పై విధంగా ట్వీట్స్ పెట్టాడు.

Pawan Kalyan- Bandla Ganesh

నిజానికి పవన్ కళ్యాణ్ కోసం ఆ మధ్యే ఒక కథను ఫైనల్ చేశాడు బండ్ల. కానీ, ఎందుకో ఆ కథ గురించి ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత పవన్ కోసం బండ్ల కథలు వింటున్నాడు అని వార్తలు వచ్చాయి. పైగా తాజాగా బండ్ల… పవన్ సినిమా గురించి ట్వీట్స్ పెట్టాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే బండ్ల ఓ స్టార్ డైరెక్టర్ ను కూడా సంప్రదించాడని.. ఎలాగూ కాంబినేషన్ లను సెట్ చేసి.. సినిమాలను తీయడంలో బండ్లకు బాగా తెలిసిన విద్య.

పైగా పవన్ కళ్యాణ్ హీరో.. ఏ స్టార్ డైరెక్టర్ అయినా డేట్స్ ఎడ్జెస్ట్ చేసి మరీ సినిమా చేయడానికి తెగ ఉత్సాహపడుతూ ఉంటాడు. బండ్ల ప్లాన్ ప్రకారం ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ – పరుశురామ్ కాంబినేషన్ లో ఓ సినిమా ప్లాన్ చేసాడట. ⁦

Also Read:Pushpa 2 OTT Rights: ‘పుష్ప 2’ కోసం ఓటీటీ సంస్థలు పోటీ.. సంచలన రికార్డులు

 

Tags