https://oktelugu.com/

Cars In Cheap Price: తక్కువ ధరకు కారు కావాలా?.. అయితే త్వరపడండి

Cars In Cheap Price: ఓ అందమైన ఇల్లు. దాని ముందు ఓ కారు ఇది ప్రతి వాడి సుందరమైన కల. ఇది ఎంత మందికి తీరుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసినప్పటికి ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యుడికి కారు చౌకగా లభించే అవకాశాలే కనిపించడం లేదు. ఫలితంగా అందరికి కారు కల తీరకుండానే పోతోంది. దీంతో ఏం చేయాలో కూడా తోచడం లేదు. కారులో దర్జాగా తిరగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ధరలు మాత్రం ఆకాశంలో […]

Written By: , Updated On : July 27, 2022 / 06:29 PM IST
Follow us on

Cars In Cheap Price: ఓ అందమైన ఇల్లు. దాని ముందు ఓ కారు ఇది ప్రతి వాడి సుందరమైన కల. ఇది ఎంత మందికి తీరుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసినప్పటికి ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యుడికి కారు చౌకగా లభించే అవకాశాలే కనిపించడం లేదు. ఫలితంగా అందరికి కారు కల తీరకుండానే పోతోంది. దీంతో ఏం చేయాలో కూడా తోచడం లేదు. కారులో దర్జాగా తిరగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ధరలు మాత్రం ఆకాశంలో ఉంటున్నాయి. ఏ కారు కొనాలన్నా రూ. 5 లక్షల పైనే ఉండటంతో సామాన్యుడు సాహసం చేయడం లేదు. ఫలితంగా వాడి కల కలగానే మిగిలిపోతోంది.

Cars In Cheap Price

Cars In Cheap Price

జీవితంలో మంచి ఉద్యోగం, ఓ అందమైన ఇల్లు, ఓ మామూలు కారు కొందామని అనుకున్నా తీరడం లేదు. దీంతో రుణం తీసుకుని కొనుగోలు చేద్దామన్నా ధరలు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో మధ్యతరగతి వారికి కారు కొనే భాగ్యం లేకుండా పోతోంది. కరోనా ప్రభావంతో అందరు వ్యక్తిగత జీవితంలో ఎవరికి తాకకుండా ఉండేందుకు చక్కనైన మార్గం కారు ఒక్కటే అని గుర్తించి చాలా మంది కార్లు కొనుగోలు చేసినా ఇంకా కొంతమంది కల తీరడం లేదు. కారు కల సాకారం కావడం లేదు.

Also Read: APJ Abdul Kalam: అంతటి కలాం కన్నీరు పెట్టుకుంటే.. చీఫ్ మార్షల్ కన్నీళ్లు తుడిచాడు!

కొన్ని కంపెనీలు మాత్రం సామాన్యులకు అందుబాటులో ఉండాలని ధరలు కాస్త తగ్గిస్తున్నాయి. రూ. 5 లక్షల లోపు ధరలు నిర్ణయించినా అన్ని కలుపుకుని మళ్లీ టార్గెల్ దాటడం తెలిసిందే. దీంతో చాలా మంది కొనుగోలుకు ముందుకు రావడం లేదు. కానీ కంపెనీలు మాత్రం వారికి సరసమైన ధరల్లో విక్రయాలు చేయాలని భావిస్తున్నాయి. ప్రస్తుతం మారుతి ఆల్టో కారు సామాన్యుల కల నెరవేరేలా ధర అందుబాటులోకి తెస్తోంది. దీని ధర రూ. 3.39 లక్షలుగా ఉన్నా టాప్ మోడల్ ధర మాత్రం రూ. 5 లక్షలు దాటుతోంది.

Cars In Cheap Price

Cars In Cheap Price

Also Read: Komatireddy Rajagopal: మునుగోడు ‘రాజ’కీయం రసకందాయం.. రాజగోపాల్‌ వెంట మరో ఇద్దరు!

Tags