Homeఆంధ్రప్రదేశ్‌BJP Forms A Committee: ఫిరాయింపులకు ప్రోత్సాహం.. బీజేపీలో ఓ కమిటీ!

BJP Forms A Committee: ఫిరాయింపులకు ప్రోత్సాహం.. బీజేపీలో ఓ కమిటీ!

BJP Forms A Committee: పార్టీ ఫిరాయింపులు.. అంటే ఒక పార్టీ గుర్తుపై ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి.. మరో పార్టీలో చేరడం. భారత దేశంలో రాజకీయ ఫిరాయింపులు ఇప్పుడే కొత్తగా రాలేదు. దశాబ్దాలుగా ఫిరాయింపులను అన్ని పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. ఏ పార్టీ కూడా దీనికి అతీతంగా లేదు. దీనికి బీజం పోసింగి కాంగ్రెస్‌.. తర్వాత బాగా ఎంకరేజ్‌ చేసింది కూడా ఇదే పార్టీ. భారతీయ జనతాపార్టీ ఇప్పుడు దీనిని ఉధృతంగా అమలు చేస్తోంది. టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకుంది. టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను జాయిన్‌ చేసుకుంది. ఇప్పుడు వైసీపీ ఏపీలో జన సేన టికెట్‌పై గెలిచిన ఒకే ఒక ఎమ్మేల్యేను పార్టీలోకి తీసుకుంది. ఫిర్యాయింపులు అనేది ఇప్పుడు కొత్తగా రాలేదు.. ఇంతటితో ఆగిపోతాయా అంటే సమాధానం లేదు. 1990లో ఫిరాయింపులు పీక్‌కు చేరడంతో దీనిని నివారించడానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

రాజ్యాంగ సవరణ..

BJP Forms A Committee
BJP Forms A Committee

పార్టీ ఫిరాయింపుల నిరోధానికి రాజ్యాంగం 10వ షెడ్యూల్‌లో ఫిరాయింపు నిరోధక చట్టాన్ని మొదటిసారిగా చేర్చారు. దీని ఉద్దేశం ఏమిటంటే ఫిరాయింపులతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, రాజకీయాలు భ్రష్టుటపడుతున్నాయని ఇందులో పేర్కొంది. దీనిని నివారించడానికే ఈ చట్టం చేశామని కేంద్రం ప్రకటించింది. కానీ ఈ చట్టంతో ఫిరాయింపులు ఏమాత్రం ఆగలేదు. ప్రజాప్రతినిధులు పార్టీలు మారుతూనే ఉన్నారు. పార్టీలు కోర్టుకు వెళ్లినా ఎలాంటి ప్రయోజన ఉండడం లేదు.

Also Read: TDP MP Ram Mohan Naidu: సిక్కోలు టీడీపీలో యువనేత చిచ్చు.. ఆ మార్పు వెనుక భారీ స్కెచ్

ఫిరాయింపులకు ఎకంరేజ్‌..

పార్టీ ఫిరాయింపులను ఇప్పటికీ అన్ని పార్టీలు ఎంకరేజ్‌ చేస్తూనే ఉన్నాయి. తాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దీనిని మరింత ఉధృతంగా అమలు చేస్తోంది. ఫిరాయింపుల ద్వారా దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకుంది. తాజాగా తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ ఫిరాయింపులకు ఏకంగా ఓ కమిటీనే ఏర్పాటు చేసింది. అయితే దానికి గౌరవ ప్రదంగా ఉండేందుకు ఫిరాయింపులు కాకుండా చేరికల కమిటీ అని పేరుపెట్టింది. గతంలో బీజేపీలో ప్రజాప్రతినిధలు చేరితే.. దానికి ఆ పార్టీ నేతలు అవతలి పార్టీ నాయకుల చేతగాని తనంగా అభివర్ణించారు. వారు తమ ప్రజాప్రతినిధులను కాపాడుకోలేకపోతున్నాయని విమర్శించారు. కానీ, తాజాగా దక్షిణాన పట్టు కోసం ప్రయత్నిస్తున్న కమలనాథులు అనైతిక చేరికలను నైతికంగా మార్చేందుకు యత్నిస్తున్నారు. ఇందు కోసం చేరికల కమిటీ అంటూ ఈటల రాజేందర్‌ నేతృత్వంలో ఒక కమిటీ నే ఏర్పాటు చేయడం గమనార్హం.

Also Read: Bimbisara Release Trailer Talk : కళ్యాణ్ రామ్ చారిత్రక పౌరుషాన్ని తట్టిలేపిన ‘బింబిసార’..

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version