Tight Underwear Problems: మనం వేసుకునే దుస్తులు కూడా మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఎండాకాలంలో నూలు దుస్తులు, చలికాలంలో ఉన్ని దుస్తులు, వర్షాకాలంలో జర్కిన్లు ఇలా మన శరీరాన్ని కాపాడే క్రమంలో దుస్తుల పాత్ర కీలకం కానుంది. అందుకే ప్రతి వారు వస్త్రాలంకరణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. అందుకే నలుగురిలో మనం వేసుకున్న దుస్తులు బ్రహ్మాండంగా కనిపించాలనే తపన అందరికి ఉంటుంది. అందుకేు వాటి ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. మన్నికైన దుస్తుల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తుండటం తెలిసిందే.
Tight Underwear Problems
ఇక మనం రోజు ధరించే లో దుస్తులు డ్రాయర్లు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. లోపల ఉండేవే కదా అనుకోవడానికి వీలు లేదు. అందుకే వాటిని ఎంపిక చేసుకోవడంలో కూడా కొన్ని ట్రిక్కులు పాటించాలి. అండర్ వేర్లు టైట్ గా ఉంటే ఉబ్బరపోసి మన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. తద్వారా అక్కడ వాసన వస్తుంది. అందుకే డ్రాయర్లు కొనుక్కునేటప్పుడు కూడా కాస్త వదులుగా ఉండేవి తీసుకోవడం ఉత్తమం. లేదంటే ఉబ్బరపోతతో చికాకు కలుగుతుంది. వాసన ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే అండర్ వేర్లు తీసుకునే సమయంలో ఈ పద్ధతులు పాటించాలి.
మరోవైపు టైట్ గా ఉండే అండర్ వేర్లతో మనిషిలోని స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో లూజుగా ఉండే అండర్ వేర్లు వాడటం అలవాటు చేసుకోవాలి. లేదంటే మనకే నష్టం. మనం వేసుకునే అండర్ వేర్లతో ఇన్ని కష్టాలు ఉంటాయని ఎవరికి తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నాక అయినా వదులుగా ఉండే వాటిని కొనుగోలు చేసుకుని వాడుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని గ్రహించుకోవాలి.
ఇంకా ఎండాకాలంలో నైతే టైట్ గా ఉండే అండర్ వేర్లతో తొడలు రాకి దురద కూడా ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో డ్రాయర్లు లూజుగా ఉండేవి తీసుకుని మనకు అనువుగా వేసుకుంటే మంచిది. లేదంటే చిక్కులు తప్పవని తెలుస్తోంది. మన ఆరోగ్య సూత్రాల క్రమంలో అండర్ వేర్లు కూడా చక్కని పాత్ర పోషిస్తాయనడంలో సందేహం లేదు. అందరు ఆలోచించుకుని అండర్ వేర్లు కొనుగోలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే ప్రయోజనకరంగా ఉంటుందని గమనించుకోవాలి.