
క్రికెట్ అభిమానులకు మరో శుభవార్త. ఐపీఎల్ 2020కి తోడుగా మమిళల మినీ ఐపీఎల్ సంబరం త్వరలో ప్రారంభం కానుంది. యూఏఈలోని షార్జా వేదికగా ‘మహిళల టీ20 చాలెంజర్ టోర్నీ’ నవంబర్‌లో జరగనుంది. ఇందుకు సంబంధించిన కెప్టెన్లను ఆదివారం బీసీసీఐ ప్రకటించింది. సూపర్ నోవాస్ టీమ్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్, ట్రయల్ బ్లేజర్స్ జట్టుకు స్మృతి మంథాన, వెలాసిటీ జట్టుకు మిథాలి రాజ్ కెప్టెన్లుగా వ్యవహిరస్తారని పేర్కొంది. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్ నవంబర్ 4 నుంచి 9 వరకు జరగనుంది. 2018లో ప్రారంభమైన మహిళల మినీ ఐపీఎల్‌లో సూపర్ నోవాస్, వెలాసిటీ జట్లు మాత్రమే ఉండేవి. ఈసారి ట్రలయ్ బ్లేజర్స్ టీంను కొత్తగా చేర్చారు.