https://oktelugu.com/

Cruise Ship: అతిపెద్ద విహార నౌక.. తుక్కుగా మారేందుకే తొలి ప్రయాణం!

Cruise Ship: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల నౌక అది. ఇరవై అంతస్తులతో, ఒకేసారి తొమ్మిదివేల మంది ప్రయాణించేందుకు వీలుంది. ఆరుబయటి స్విమ్మింగ్‌ పూల్‌. విశాలమైన సినిమా థియేటర్‌ వంటి భారీ హంగులు ఉన్నాయి. అట్టహాసంగా నిర్మించిన దీనికి ‘గ్లోబల్‌ డ్రీమ్‌–2’ అని నామకరణం చేశారు. అయితే, తొలి ప్రయాణానికి ముందే ఇది తునాతునకలై తుక్కుగా మానపేంది. జర్మన్‌–హాంకాంగ్‌ నౌకా నిర్మాణ సంస్థ ‘ఎంవీ వెర్ఫ్‌టెన్‌’ ఈ భారీ నౌక నిర్మాణం చేపట్టింది. దీని నిర్మాణానికి 120 కోట్ల […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : September 19, 2022 / 04:13 PM IST
    Follow us on

    Cruise Ship: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల నౌక అది. ఇరవై అంతస్తులతో, ఒకేసారి తొమ్మిదివేల మంది ప్రయాణించేందుకు వీలుంది. ఆరుబయటి స్విమ్మింగ్‌ పూల్‌. విశాలమైన సినిమా థియేటర్‌ వంటి భారీ హంగులు ఉన్నాయి. అట్టహాసంగా నిర్మించిన దీనికి ‘గ్లోబల్‌ డ్రీమ్‌–2’ అని నామకరణం చేశారు. అయితే, తొలి ప్రయాణానికి ముందే ఇది తునాతునకలై తుక్కుగా మానపేంది.

    Cruise Ship

    జర్మన్‌–హాంకాంగ్‌ నౌకా నిర్మాణ సంస్థ ‘ఎంవీ వెర్ఫ్‌టెన్‌’ ఈ భారీ నౌక నిర్మాణం చేపట్టింది. దీని నిర్మాణానికి 120 కోట్ల పౌండ్ల (భారత కరెన్సీలో సుమారు రూ.11,090 కోట్లు) అంచనా వేయగా, నిర్మాణ సంస్థ దీనికోసం ఇప్పటికే 90 కోట్ల పౌండ్లు (రూ.8,318 కోట్లు) ఖర్చు చేసింది. నిర్మాణం దాదాపుగా పూర్తయింది. సంస్థ వద్ద ని«ధులు పూర్తిగా ఖర్చయిపోయాయి. తుదిమెరుగులు పూర్తి చేసి, నౌకను ప్రయాణం కోసం సముద్రంలోకి దించాలంటే, మరో 30 కోట్ల పౌండ్లు (రూ.2,772 కోట్లు) కావాల్సి ఉంటుంది. ఎంవీ వెర్ఫ్‌టెన్‌ సంస్థ ఇంతవరకు ఆ నిధులను సమకూర్చుకోలేకపోయింది. దీనిని యథాతధంగా అమ్మాలని నిర్ణయించుకున్నా, దీనిని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.

    తుక్కుగా అమ్మాలని నిర్ణయం..

    నిధులు సమకూరకపోవడం, కొనుగోలుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ నౌకను, దీంతోపాటు దీనికి ముందు నిర్మించిన ‘గ్లోబల్‌ డ్రీమ్‌’ నౌకను కూడా తునాతునకలు చేసి, విడిభాగాలను తుక్కుగా అమ్ముకుని కొంతైనా నష్టాల నుంచి బయటపడాలని ఎంవీ వెర్ఫ్‌టెన్‌ సంస్థ నిర్ణయించుకుంది.

    ఇటీవలే తొలి విహార నౌక సర్వీస్‌ ప్రారంభం..

    Cruise Ship

    తొలి విహార నౌక సర్వీస్‌ ఇటీవలే ప్రారంభమైంది. సాగర నగరం విశాఖపట్నం నుంచే అండమాన్‌కు ఎంప్రెస్‌ కార్డిలియా అనే క్రూయిజ్‌ షిప్‌ ఈ జల విహారం ప్రారంభించింది. ప్రయాణికులను సముద్రంలో జలవిహారానికి తీసుకెళ్లే నౌకలను విహార నౌకలు.. క్రూయిజ్‌ షిప్పులు అంటుంటారు. ఇటువంటి నౌకా విహారాలు మనదేశంలో ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతున్నాయి. కానీ విదేశాల్లో క్రూయిజ్‌ సర్వీసులు ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నాయి. వేలమంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన నౌకలు కూడా ఉన్నాయి. అటువంటి వాటిలో గ్లోబల్‌ డ్రీమ్‌ సర్వీస్‌ ప్రముఖమైనది. విషాదం ఏమిటంటే ఈ సంస్థ గ్లోబల్‌ డ్రీమ్స్‌–2 పేరుతో నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్‌ షిప్‌ సర్వీస్‌ ప్రారంభించక ముందే మనుగడ కోల్పోవడం.

    గ్లోబల్‌ డ్రీమ్‌–2 ప్రత్యేకతలు

    ఆసియా ఖండానికి చెందిన డ్రీమ్‌ క్రూయిజస్‌ సంస్థకు గ్లోబల్‌ డ్రీమ్‌ పేరుతో ఇప్పటికే ఒక భారీ క్రూయిజ్‌ షిప్‌ ఉంది. నౌకా విహార సర్వీసులు నిర్వహించే ఈ సంస్థ గ్లోబల్‌ డ్రీమ్‌–2 పేరుతో మరో నౌక సమకూర్చుకోవాలని సంకల్పించింది. జర్మనీ బాల్టిక్‌ తీరంలో ఉన్న ఎంవీ వేర్ఫెన్‌ షిప్‌ యార్డులో ఈ నౌకా నిర్మాణం తుది దశలో ఉంది. దీని పొడవు 342 మీటర్లు, వెడల్పు 46.4 మీటర్లు, ఎత్తు 9.5 మీటర్లు, విద్యుదుత్పత్తి సామర్థ్యం 96 వేల కిలోవాట్లు. బరువు 2.08 లక్షల టన్నులు. ప్రపంచంలో అతిపెద్దవిగా గుర్తింపు పొందిన రాయల్‌ కరీబియన్‌ సంస్థకు చెందిన ఆయాసిస్‌ సిరీస్‌లోని ఐదు నౌకల తర్వాత ఆరో స్థానంలో గ్లోబల్‌ డ్రీమ్‌ నౌకలు నిలుస్తున్నాయి. అయితే నిర్మాణంలో ఉన్న డ్రీమ్‌–2 నౌకకు పెద్ద కష్టమే వచ్చి పడింది. జలవిహారానికి నోచుకోలేని దుస్థితి ఏర్పడింది.

    కరోనాతో నిర్మాణ సంస్థ దివాలా..

    కరోనా సంక్షోభం అన్ని రంగాల్లాగే క్రూయిజ్‌ సర్వీసులను కూడా తీవ్రంగా దెబ్బతీసింది. ప్రపంచవ్యాప్తంగా జలవిహార బిజినెస్‌ పడిపోయింది. ఫలితంగా గ్లోబల్‌ డ్రీమ్, దాని మాతృసంస్థ జెంటింగ్‌ హాంకాంగ్‌
    తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. దాంతో గ్లోబల్‌ డ్రీమ్‌ యాజమాన్యం ఈ ఏడాది జనవరిలోనే బ్యాంకుల్లో దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది. నిర్మాణం తుది దశలో ఉన్న గ్లోబల్‌ డ్రీమ్‌–2 నౌకను అమ్మకానికి పెట్టింది. అయితే దాన్ని కొనడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. గత్యంతరం లేక డ్రీమ్‌–2ను భాగాలుగా విడగొట్టి అమ్మేయాలని రుణ దాతలు నిర్ణయించారు. ఫలితంగా ఇంకా జలవిహారమే ప్రారంభించని ఈ అతిపెద్ద క్రూయిజ్‌ షిప్‌ తొలి ప్రయాణాన్నే స్క్రాప్‌ యార్డు వైపు సాగించనుంది. ఈ ఏడాది చివరిలోగా ఈ నౌకను షిప్‌ యార్డ్‌ నుంచి తరలించాలని నిర్ణయించారు.

    Tags