Hero Ravi Teja: రవితేజ వరుసపెట్టి సినిమాలు తీస్తాడు, కానీ హిట్స్ మాత్రం అప్పుడప్పుడు ఇస్తుంటాడు. అయితే అలా హిట్ వచ్చిన ప్రతిసారి రవితేజ తన రెమ్యూనరేషన్ పెంచేస్తుంటాడు. కానీ ప్లాప్ వచ్చినప్పుడు మాత్రం తన రెమ్యునరేషన్ ను తగ్గించడు. రామారావు రూపంలో ఓ అట్టర్ ఫ్లాప్ ఇచ్చాడు. అయినప్పటికీ రేటు అలాగే ఉంచాడు. ప్రస్తుతం రవితేజ ప్రతి సినిమాకు అటుఇటుగా 11 నుంచి 16 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు.
తాజాగా పారితోషికం సవరించాల్సిన అవసరం ఉంది అంటూ నిర్మాతలు ప్రపోజల్స్ పెడుతున్నారు గానీ, రవితేజ మాత్రం తగ్గేలా లేడు. అయితే, ఇప్పుడీ తన కొత్త సినిమా రేటును రవితేజ రౌండ్ ఫిగర్ చేశాడు. తన తాజా చిత్రానికి 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. రవితేజ తన రేటు తగ్గించడానికి ప్రధాన కారణం.. ఈ సినిమా వ్యవహారంలో హీరోయిన్ గట్రా అన్ని ఆయన గారు చెప్పినట్టే జరగాలి.
కాబట్టి.. ఈ సినిమా రెమ్యునరేషన్ విషయంలో కాస్త చూసి చూడనట్టు ముందుకు పోతున్నాడు. కానీ మరో సినిమాకి మాత్రం 14 కోట్లకు తగ్గను అంటున్నాడు. నిజానికి తన రేటు ను రవితేజ పెంచుకోవడంలో తప్పు లేదు, అది అతడి ఇష్టం. నచ్చితే నిర్మాతలు రవితేజతో సినిమాలు తీసుకుంటారు, లేదంటే తప్పుకుంటారు. కానీ ఈసారి రవితేజ రేటు పెంచిన విధానం మాత్రం సహేతుకంగా లేదు.
ముందు అగ్రిమెంట్ మీద 11 కోట్లకు సినిమా చేస్తాను అని సంతకాలు చేశాడు. ఇపుడు మాట మారుస్తున్నాడు. తీరా అగ్రిమెంట్ కు వచ్చేసరికి, ఇవ్వన్నీ ఇక్కడ వర్కౌట్ అవ్వవు అంటున్నాడు. అసలే రవితేజ పై భారీ బడ్జెట్ సినిమాలు సెట్ కావడం లేదు. మరోవైపు రవితేజ ఎక్స్ ట్రా కోట్లు కోట్లు అడుగుతున్నాడు. ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తున్న రవితేజ, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పాలసీని తూచ తప్పకుండా ఫాలో అవుతున్నాడు.
అందుకే కథ కాస్త అటుఇటుగా ఉన్నప్పటికీ.. పారితోషికం ఎక్కువగా ఇచ్చే బ్యానర్లకు రవితేజ గుడ్డిగా కాల్షీట్లు ఇస్తున్నాడు. మరి ఇలా అయితే, రవితేజ హవా ఇంకెన్నాళ్లో సాగకపోవచ్చు. ఇప్పటికైనా రవితేజ మారాలి.
Recommended videos: