
కోల్ కతా నైట్ రైడర్ష ఆటగాడు సునీల్ సరైన్ తిరిగి మైదానంలోకి రాబోతున్నాడు. అనుమానాస్పద బోలింగ్ తో కొన్ని మ్యాచ్లకు సరైన్ దూరమయ్యాడు. సస్పెక్ట్ బౌలింగ్ యాక్షన్ కమిటీ అతనికి కొన్ని మ్యాచ్ లకు దూరంగా పెట్టింది. పంజాబ్ తో మ్యాచ్ అనంతరం అంఫైర్లు ఫిర్యాదు చేయడంతో అప్పటి నుంచి సరైన్ స్టేడియంలోకి అడుగుపెట్టలేదు. తాజాగా ఆయనకు సస్పెక్ట్ బౌలింగ్ యాక్షన్ కమిటీ క్లీన్ చీట్ ఇవ్వడంతో మళ్లీ ఆడే అవకాశాలు కన్పిస్తున్నాయి. సరైన్ కు క్లీన్ చీట్ తో కోల్ కతాకు మళ్లీ బలమొచ్చనట్లయింది.