
ఆంధ్రప్రదేశ్లో బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసింది. ఆదివారం తాడేపల్లిగూడెంలో ఆ కార్పోరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను మంత్రులు ప్రకటించారు. ఒక్కో కార్పొరేషన్ కు చైర్మన్ తో పాటు 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కాగా,చైర్మన్, డైరెక్టర్ పదవుల్లో అన్ని జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించారు. బీసీల్లోని 139 కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని తొలుత భావించారు . కాని 30 వేలకు తగ్గకుండా జనాభా ఉన్న వాటిని పరిగణలోకి తీసుకొని మొత్తంగా 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు.