Human Ears: మన శరీరంలో ఏ భాగం పనిచేయకున్నా ఇబ్బందే. అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తేనే మనిషి మనుగడ ప్రశాంతంగా ఉంటుంది. అలాంటిది మన దేహంలో అన్ని భాగాలు బాగుంటేనే మనకు సమస్యలు రావు. ఏది పనిచేయకపోయినా ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. మనలో చాలా మంది చెవుల్లో ఏవేవో పుల్లలు పెట్టి కెళుకుతుంటారు. భోజనం చేసిన పళ్లల్లో కూడా అగ్గిపుల్లలు పెట్టడం చూస్తుంటాం. వైద్యులు మాత్రం ఇవి కరెక్ట్ కాదంటున్నారు.

ఇతరులు చెప్పిన దాన్ని మనం వినాలంటే చెవి ఉండాల్సిందే. ఆ చెవి కూడా సున్నితమైనదే కావడం గమనార్హం. అందుకే మనం చెవుల్లో ఎలాంటి పుల్లలు పెట్టకూడదు. గుబిలి తీసే క్రమంలో ఏవో వాడుతూ చెవుల్లో గుచ్చుతుంటారు. దీంతో చెవిలోని పొర దెబ్బతినే ప్రమాదం పొంచి ఉందని తెలుసుకోవాలి. చెవిపోటు, దుమ్ము, ధూళి, గులిమి వంటి వాటితో చెవిలో నొప్పి, దురద, చీము కారడం వంటివి జరిగే ఆస్కారం ఉంది. దీంతో వినికిడి లోపం కూడా రావొచ్చు. చెవులను ఎప్పుడు జాగ్రత్తగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.
ఎక్కువగా ఈత కొట్టేటప్పుడు చెవిలోకి నీరు పోయే ప్రమాదం ఉంటుంది. ఆ సమయంలో అప్రమత్తంగా ఉండాలి. వైద్యుల సూచనల మేరకు చెవి రక్షణకు చర్యలు తీసుకోవాలి. లేకపోతే చెవుల్లోకి నీరు వెళితే మనకు ఇబ్బందులు తలెత్తవచ్చు. అగ్గిపుల్లలకు దూది కట్టి వాటిని చెవుల్లోకి జొప్పించడం చేస్తుంటాం. నిజానికి చెవిలో ఉండే గుమిలి చివిని కాపాడుతుంది. దీంతో చెవికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇది తెలియని వారు దాన్ని తీసే క్రమంలో చెవులకు ప్రమాదాలు తెస్తున్నారు.
ఇన్ఫెక్షన్ ల వల్ల చెవులకు నష్టం కలిగితే చెవుడు, చెవిపోటు, కర్ణబేరి దెబ్బతినడం, మెదడు వాపు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే చెవులను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్ఫెక్షన్లు సోకకుండా చూసుకోవాలి. లేదంటే మొత్తం చెవులు పనిచేయకపోయే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. వైద్యుల సలహాలు, సూచనల మేరకు చెవులను కాపాడుకోవాలి. లేదంటే ఏదిపడితే అది చెవుల్లో పెడితే లేనిపోని కష్టాలు తెచ్చుకునే ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయని తెలుసుకోవాలి.