Kavitha Involved Delhi Liquor Scam: ఢిల్లీలో లిక్కర్ మద్యం కుంభకోణం వెలుగు చూసింది. దీంతో నేతల్లో భయం పట్టుకుంది. ఉప ముఖ్యమంత్రి మనీష్ పిసోడియాతో పాటు 14 మందిపై సీబీఐ నోటుసులు జారీ చేసింది. దీంతో అందరిలో ఆందోళన మొదలైంది. ఈ పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర పోషించింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితదే అని తెలుస్తోంది. ఢిల్లీలో మద్యం పాలసీని వ్యాప్తి చేయడంలో కవిత పాత్రపై బీజేపీ ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ చేసిన ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. దీంతో తెలంగాణ నుంచి వచ్చిన వారే రూ.150 కోట్లు చేతులు మారినట్లు చెబుతున్నారు.

పంజాబ్, బెంగాల్ లో తీసుకొచ్చిన మద్యం పాలసీల్లో కూడా తెలంగాణ నేతల ప్రమేయం ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎవరెవరు ఉన్నారనే దానిపై ఇంకా లోతుగా అధ్యయనం కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు బయటకు వస్తున్నాయి. ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో వీరు మకాం వేసినట్లు తెలుస్తోంది. వీరిని తీసుకొచ్చేందుకు ఓ ప్రైవేటు విమానం సమకూర్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో లిక్కర్ స్కాంపై అందరి దృష్టి పడుతోంది.
ఈ మేరకు తెలంగాణ ఎంపీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో హస్తం ఉందంటూ ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ చేసిన ఆరోపణలపై చర్చ జరుగుతోంది. తన వద్ద ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్పడం గమనార్హం. దీంతో లిక్కర్ కేసు తెలంగాణ మెడకు చుట్టుకున్నట్లు అయింది. తామేదో నీతివంతులుగా ప్రగల్బాలు పలికే కేసీఆర్ ప్రస్తుతం దీనిపై ఏం సమాధానం చెబుతారు. తమకు ఎలాంటి ప్రమేయం లేదని ఎలా నిరూపించుకుంటారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ పిసోడియా సమక్షంలోనే మద్యం పాలసీ రూపుదిద్దుకున్నట్లు చెప్పడం కొసమెరుపు.
హైదరాబాద్ లోని కోకాపేటలోని రామచంద్ర పిళ్లై ఇంట్లో కీలక డాక్యుమెంట్లు దొరికినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా విచారణ చేపడితే వీరి బాగోతం బయటకు వచ్చినట్లు చెబుతున్నారు. లిక్కర్ స్కాంలో ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ గా తెలంగాణకు చెందిన గోపికృష్ణ ఉండటంతో ఈ తతంగం సులువుగా జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన పదిమందికి ఇందులో వాటాలున్నట్లు సమాచారం. దీంతో తీగ లాగితే డొంకంత కదిలినట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కాం కాస్త కవిత మెడకు చుట్టుకున్నట్లు చెబుతున్నారు. ఇక టీఆర్ఎస్ పరిస్థితి ఏంటో వారికే తెలియాలని పలువరు రాజకీయ ప్రముఖులు సూచిస్తున్నారు.