Pouring Urine On Vegetables: మనిషికి వేపకాయంత వెర్రి ఉంటుంది. అది వేయి రకాలుగా ఉంటుందట. ఒక్కొక్కరిది ఒక్కో తీరు. మనం సాధారణంగా కూరగాయలను ఆహారంగా వండుకుని తింటాం. వాటిని నీళ్లతో శుభ్రం చేసి తరువాత కోసుకుని కూర చేసుకుంటాం. కానీ ఇక్కడో వ్యక్తి కూరగాయలను మూత్రంతో కడిగాడు. పైగా వాటిని విక్రయించాడు. దీంతో అందరిలో ఆందోళన నెలకొంది. కూరగాయలను మూత్రంతో కడగడమేమిటని ఆశ్చర్యపోతున్నారు. తినే వాటిని ఎంత పవిత్రంగా చూసుకుంటాం. అన్నం పరబ్రహ్మ స్వరూపమని భావించి తినేటప్పుడు కూడా మొక్కి తింటుంటాం. అలాంటి పవిత్రమైన కూరగాయలను అతడు మూత్రంతో కడగడమేమిటనే సందేహాలు అందరికి రావడం ఖాయమే.
ఉత్తరప్రదేశ్ లోని బరేలిలో ఓ కూరగాయల వ్యాపారి చేసిన పనికి అందరు సిగ్గుపడుతున్నారు. కూరగాయలను ఆహారంగా తీసుకోవడంతో వాటిని మనం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. వాటిని నీటితో కడిగి తరువాత కూరగా వండుకుంటాం. కానీ అతడు మాత్రం మూత్రంతో కడిగి విక్రయించేందుకు సిద్ధం కావడంతో అందరు పరేషాన్ అవుతున్నారు. ఈ తతంగాన్ని ఓ వ్యక్తి కారులోనుంచి వీడియో తీయడంతో అది కాస్త వైరల్ గా మారింది. సదరు వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు.
మన జీవనగమనంలో కూరగాయల పాత్ర ముఖ్యమే. అందుకే వాటిని మనం ఎంతో విలువైనవిగా భావిస్తాం. బేరం చేసి మరీ కూరగాయలను కొంటాం. ఇంటికొచ్చాక కూడా వాటిని శుభ్రం చేసి వాడుకుంటాం. మన ఆరోగ్యంలో కీలక పాత్ర పోషించే కూరగాయలను అతడు ఎందుకు అలా చేశాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అతడి మానసిక పరిస్థితి బాగుందా? లేక ఏదైనా సమస్యతో బాధపడుతున్నాడా అనే కోణంలో విచారిస్తున్నారు. తినే వాటిపై మూత్రం పోయడంతో అందరు కూరగాయలు కొనేందుకు వెనకాడుతున్నారు.
వ్యాపారి చేసిన పనికి సిగ్గుపడుతున్నారు. ఎవరికైనా చెబితే పరువు పోతుందనే అభిప్రాయం అందరిలో వస్తోంది. కూరగాయలపై మూత్రం పోయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అతడికేమైన వింత జబ్బు ఉందేమో. మానసిక పరివర్తన సరిగా లేదేమో అందుకే అలా కూరగాయలపై యూరిన్ పోశాడేమో అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. వ్యాపారి చేసిన పనికి ఏం చేయాలి? వాటిని కొనుక్కున్న వారి పరిస్థితి ఏమిటి? అసలు ఎన్నాళ్లుగా ఇలా చేస్తున్నాడో? ఇప్పటికి గాని అతడి అసలు స్వరూపం బయటపడలేదని అందరు వ్యాఖ్యానిస్తున్నారు.
కూరగాయలపై మూత్రం పోయడం క్షమించరాని నేరం. తినే పదార్థాలను కలుషితం చేసే గుణం ఏమిటో తెలియడం లేదు. ఎవరైనా కూరగాయలను చేతులతో కడుగుతారు? కానీ అతడు మాత్రం మూత్రంతో కడగడం సంచలనం కలిగించింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. వ్యాపారి చేసిన పనికి అందరు దుమ్మెత్తిపోస్తున్నారు. అన్నం తింటున్నాడా? ఇంకేమైనా తింటున్నాడా? అనే వాదనలు వస్తున్నాయి. సదరు పని చేసిన వాడిని క్షమించొద్దని పలువురు డిమాండ్ చేయడం గమనార్హం.