
ఆక్ప్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలను శుక్రవారం పున: ప్రారంభించారు. గతంలో కొందరు వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్ ఇవ్వగా కొందరికి అస్వస్థత లక్షణాలు కనిపించాయి. దీంతో ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే డ్రగ్స్ కంట్రోలర్స్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు రావడంతో తిరిగి ప్రారంభించారు. పుణెలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రి, ససాన్ జనరల్ ఆసుపత్రిలో సీరం ఇనిస్టిటట్యూట్ ఆఫ్ ఇండియాతో కలిసి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఈప్రయోగాలను చేపడుతోంది. కాగా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో వాలంటీర్లకు రెండో డోసును ఇచ్చారు. వారిలో అస్వస్థ లక్షణాలు కనిపించినప్పటికీ అవని సాధారణమేనని ఓ వైద్యుడు తెలిపారు.
Also Read: దేశంలో 63 లక్షల కరోనా కేసులు..