ఐపీఎల్-2020: కఠిన ‘బుడగ’ నిబంధన.. లేదంటే వేటే? 

కరోనా సమయంలోనూ క్రికెట్ ప్రియులను ఐపీఎల్-2020 అలరిస్తోంది. ఎడారి దేశంలో ప్రారంభమైన టోర్నీ క్రికెట్ అభిమానుల్లో జోష్ నింపుతోంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచులు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. అయితే కరోనా నిబంధనలు పాటించని క్రికెటర్లపై వేటువేసేందుకు బీసీసీఐ వెనుకడటం లేదు. Also Read: చెన్నైతో రైనా.. భజ్జీ బంధానికి తెరపడనుందా? ఐపీఎల్-2020 ప్రారంభానికి ముందే ఆటగాళ్లను హోం క్వారంట్లో ఉంచారు. బయో బబుల్ లో కొన్నివారాలపాటు ఉంచారు. వీరికోసం బీసీసీఐ, ఐపీఎల్ ప్రాంచైజీ జట్లు […]

Written By: NARESH, Updated On : October 2, 2020 2:31 pm
Follow us on

కరోనా సమయంలోనూ క్రికెట్ ప్రియులను ఐపీఎల్-2020 అలరిస్తోంది. ఎడారి దేశంలో ప్రారంభమైన టోర్నీ క్రికెట్ అభిమానుల్లో జోష్ నింపుతోంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచులు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. అయితే కరోనా నిబంధనలు పాటించని క్రికెటర్లపై వేటువేసేందుకు బీసీసీఐ వెనుకడటం లేదు.

Also Read: చెన్నైతో రైనా.. భజ్జీ బంధానికి తెరపడనుందా?

ఐపీఎల్-2020 ప్రారంభానికి ముందే ఆటగాళ్లను హోం క్వారంట్లో ఉంచారు. బయో బబుల్ లో కొన్నివారాలపాటు ఉంచారు. వీరికోసం బీసీసీఐ, ఐపీఎల్ ప్రాంచైజీ జట్లు వేలరూపాయలను ఖర్చుపెట్టారు. కరోనా టెస్టుల్లో నెగిటివ్ వచ్చాన ఆటగాళ్లతోనే బీసీసీఐ ఐపీఎల్ నిర్వహణకు సిద్ధమైంది.

అయితే బయో బబుల్‌ నిబంధనల పట్ల ఐపీఎల్‌ జట్లన్నీ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిందేనట. క్రికెటర్లు ఎవరైనా బయో బబుల్‌ నుంచి బయటకు వస్తే అతడు ఆరు రోజులపాటు హోంక్వారంటైన్లోకి వెళ్లాల్సిందే. ఆటగాడు రెండోసారీ కూడా ఇలానే చేస్తే ఒక మ్యాచ్‌ సస్పెన్షన్‌ కు గురవుతాడు. మూడోసారి కూడా నిబంధనలను ఉల్లంఘిస్తే సదరు ఆటగాడిని టోర్ని నుంచి సాగనంపుతారు. అతడి స్థానంలో మరో క్రికెటర్ అనుమతించరు.

ఇటీవల చెన్నై జట్టుకు చెందిన పేసర్‌ కేఎం ఆసిఫ్‌ బయో బబుల్‌ నిబంధనలను ఉల్లంఘించిన తొలి క్రికెటర్‌ గా గుర్తింపు పొందాడు. ఆసిఫ్ తన హోటల్‌ గది తాళం పోగొట్టుకున్నారు. తాళం కోసం రిసెప్షన్ వద్దకు వెళ్లాడు.. ఆ ప్రాంతం బయో బబుల్‌ పరిధిలోకి రాకపోవడంతో అతడిని ఆరురోజులపాటు స్వీయనిర్భంధంలో ఉంచారు. అనంతరం అతడికి కరోనా టెస్టులు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. దీంతో అతడు చెన్నై జట్టులో చేరాడు.

Also Read: ఐపీఎల్ వైరల్:హైదరాబాదీ కా మామ.. విలియమ్సన్‌ రాకతో సన్‌‘రైజ్‌’

ఐపీఎల్ నిర్వహాకులు ఎప్పటికప్పుడు క్రికెటర్ల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటున్నారు. క్రికెటర్లు.. సహాయ సిబ్బందిని బయటి వ్యక్తులతో మాట్లాడిస్తే ప్రాంచైజీలు కోటి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఐపీఎల్ పాయింట్లు కూడా కోల్పోవాల్సి ఉంటుంది. దీంతో ప్రాంచైజీలు ఈ నిబంధనలపై ఒక్కింత ఆందోళనలో ఉన్నాయి. అయితే కరోనా సమయంలో టోర్నీ నిర్వహించాలంటే ఇలాంటి కఠిన నిబంధనలు తప్పనిసరి అంటూ పలువురు బీసీసీఐకి మద్దతు పలుకుతుండటం గమనార్హం.