Marriage Difference Between Male And Female: వివాహ వ్యవస్థలో మన దేశ సంప్రదాయాన్ని అన్ని దేశాలు గౌరవిస్తాయి. అంతటి మహత్తర శక్తి మన వ్యవస్థలో ఉండటమే కారణం. సనాతన సంప్రదాయం ప్రకారం మన వివాహం ఆచార వ్యవహారాలకు అక్షర రూపంగా వర్ధిల్లుతోంది. పాశ్చాత్యులు మన సంప్రదాయాన్ని చూసి మురిసిపోతుంటారు. మన మంత్రాలను ఇష్టపడుతుంటారు. జీవితాంతం ఒకరితోనే మన బంధం పెనవేసుకోవడం వారికి ఎంతో ఉన్నతంగా అనిపిస్తుంది. అంతటి మహత్తర శక్తి గల మన వివాహ వ్యవస్థ రానురాను మారిపోతోంది. మంత్రాల సాక్షిగా జరుగుతున్న పెళ్లిళ్లు కొన్ని మధ్యలోనే విడిపోవడం బాధాకరమే. కానీ మొత్తానికి అధిక శాతం జంటలు మాత్రం కలకాలం ఒకటిగా జీవించడంతోనే మనకు ఇంకా విలువ పెరుగుతోంది.

వివాహ వయసు మీద కూడా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. రామాయణంలో రాముడి కంటే సీత పెద్దదనే వాదన కూడా ఉంది. భారత క్రికెట్ స్టార్ సచిన్ టెండుల్కర్ కంటే అతడి భార్య ఆరు సంవత్సరాలు పెద్దదని తెలిసిందే. కానీ వారిది ప్రేమ వివాహం కావడంతో అవేమీ లెక్కలోకి రాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య ఎంత వయసులో తేడా ఉంటే మంచిదనే దాని మీద కచ్చితమైన సూత్రప్రాతిపదిక సిద్ధాంతాలేవి లేకున్నా కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని నిబంధనలు వ్యక్తం చేస్తున్నారు.
మన దేశంలో కనీస వివాహ వయసు 21 ఏళ్లు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా అదే నిబంధన ప్రభుత్వం విధించింది. చాలా మంది 21 ఏళ్లకే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి అనే నిర్ణయానికి ఎక్కువ మంది ఓటు వేస్తున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కూడా వివాహాలు చేసుకునే జంటల వయసు పెరిగిపోతోంది. ఫలితంగా అనేక సమస్యలు వస్తున్నాయి. సంతానం మీద ప్రభావం చూపుతోంది. చిన్న వయసులో అయితేనే పిల్లలు పుట్టడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. అదే వయసు ముదిరితే సంతాన భాగ్యం కలగడం ఇబ్బందే.
ఇటీవల కాలంలో సినిమా స్టార్లు తమకంటే చిన్న వయసు వాళ్లను పెళ్లి చేసుకుంటున్నారు. దీంతో అనేక రకాల సమస్యలు వస్తాయని తెలిసినా కూడా పట్టించుకోవడం లేదు. తమకంటే వయసులో ఓ ఐదారేళ్లు పెద్దవారిని చేసుకుంటే ఏం కాదు కానీ మరీ ఇరవై ఏళ్లు అంటే బాగుండదు. కానీ సినిమా వాళ్లు మాత్రం ఇలాగే చేస్తున్నారు. వయసు తేడాలు చూసుకోవడం లేదు. ఫలితంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా లెక్కలోకి తీసుకోవడం లేదు. వయసులో తేడాలు పెరిగితే అనేక సమస్యలు చుట్టుముడతాయనడంలో సందేహం లేదు.
పూర్వం రోజుల్లో అయితే బాల్య వివాహాలు ఉండేవి. నలభై ఏళ్ల వ్యక్తి పదేళ్ల పిల్లను పెళ్లి చేసుకున్న సంఘటనలు కూడా మనదేశంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇంత గ్యాప్ ఉంటే ఇక వివాహమెందుకు? ఏం చేసుకోవడానికి? జంట అంటే చూడ ముచ్చటగా ఉండాలి. చిలకా గోరింకల్లా అన్యోన్యంగా కనిపించాలి. అంతే కాని కాకి, చిలక లాగా ఉంటే ఏం బాగుంటుంది. అందుకే వివాహ వయసులో పెద్దగా తేడాలుండకూడదు. ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే సమస్యలు కూడా ఎక్కువే. దీంతో అనర్థాలు వస్తాయి.
ఇవి గుర్తుంచుకుని మన దేశంలోని ప్రజలు వివాహం చేసుకునే వయసులో తేడాలు ఉండకుండా చూసుకుంటే మంచిది. ఆకలంత పోయినాక అన్నమెందుకు ఈడంత పోయినాక పెళ్లెందుకు అనే సామెత ఉంది. ఏ వయసులో జరగాల్సిన అచ్చట ముచ్చట ఆ వయసులోనే జరగాలి. లేకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసుకోవాలి.