https://oktelugu.com/

Gun Culture: గన్ కల్చర్ తో హైదరాబాద్ హైరానా..!

Hyderabad Hirana with gun culture: తెలంగాణ రాజధాని హైదరాబాద్ విశ్వనగరంగా అందరి మన్నలను పొందుతోంది. అన్ని కులాలు, మతాలు, జాతుల వారు ఈ ప్రాంతంలో అన్నదమ్ముల్లా నివసిస్తుంటారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన భాగ్యనగరం క్రమంగా తన ప్రతిష్టను కోల్పోతుందనే వాదనలు కొన్నిరోజుల నుంచి బలంగా విన్పిస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ నగరం ఐటీ, రియల్టర్, సినిమా, ఫార్మా, హోటల్, ఇతర వ్యాపార రంగాలకు స్వర్గధామంగా నిలుస్తోంది. దీంతో నగరం రోజుకురోజు శరవేగంగా విస్తరిస్తూ తెలంగాణకు […]

Written By:
  • NARESH
  • , Updated On : August 2, 2022 / 11:32 AM IST
    Follow us on

    Hyderabad Hirana with gun culture: తెలంగాణ రాజధాని హైదరాబాద్ విశ్వనగరంగా అందరి మన్నలను పొందుతోంది. అన్ని కులాలు, మతాలు, జాతుల వారు ఈ ప్రాంతంలో అన్నదమ్ముల్లా నివసిస్తుంటారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన భాగ్యనగరం క్రమంగా తన ప్రతిష్టను కోల్పోతుందనే వాదనలు కొన్నిరోజుల నుంచి బలంగా విన్పిస్తున్నాయి.

    కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ నగరం ఐటీ, రియల్టర్, సినిమా, ఫార్మా, హోటల్, ఇతర వ్యాపార రంగాలకు స్వర్గధామంగా నిలుస్తోంది. దీంతో నగరం రోజుకురోజు శరవేగంగా విస్తరిస్తూ తెలంగాణకు బంగారు గనిలా మారింది. అయితే ఇదే సమయంలో కొన్ని అసాంఘిక శక్తులకు హైదరాబాద్ కేరాఫ్ గా మారుతుండటం ఆందోళనకు కారణమవుతోంది.

    ఇటీవలీ కాలంలో హైదరాబాద్లో డ్రగ్స్ కల్చర్, పబ్ కల్చర్, బెట్టింగ్ కల్చర్ విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఈ విషయంలో రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు, ప్రముఖుల హస్తం ఉండటంతో పోలీసులు దీనిని పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడపాదడపా డగ్స్, మాదక ద్రవ్యాలను పట్టుకొని తుతూమంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు.

    గల్లీకో మద్యం షాపు, పబ్బులు, విచ్చలవిడిగా డగ్స్ అందుబాటులో ఉండటం వంటివి హైదరాబాద్ ప్రతిష్టను మసక బారుస్తున్నాయి. దీనికి తోడు ఇటీవల గన్ కల్చర్ కూడా హైదరాబాద్ ను హైరానా పెట్టిస్తోంది. గ్యాంగ్ వార్స్, రియల్టర్ మధ్య గొడవలు, సెటిమెంట్స్ వంటి వాటిల్లో గన్ కల్చర్ ఇటీవల పెరిగిపోయింది.

    గన్స్ తో ప్రత్యర్థులను బెదిరించడానికి కాకుండా  ఏకంగా పాయింట్ బ్లాక్ రేంజులో కాల్పలు జరుగుతున్న సంఘటనలు ఇటీవల వెలుగు చూస్తున్నాయి. అలాగే నడిరోడ్డుపై హత్యలు, గ్యాంగ్ వార్స్ సంఘటనలు తరుచూ చోటుచేసుకుండటం నగరవాసులను హడలెత్తిస్తోంది.

    తాజాగా మాదాపూర్‌ ఠాణా పరిధిలోని నీరూస్‌ చౌరస్తాలో రియల్టర్లుగా మారిన ఇద్దరు నేరచరితుల మధ్య రేగిన వివాదం కాల్పులకు దారి తీసింది. చిన్నచిన్న వివాదానికే తుపాకులు, తూటాలు పేలుతున్నాయి. ఇటీవల కాలంలో తుపాకులకు సంబంధించిన అత్యధిక నేరాలు అక్రమ ఆయుధాలతోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది.

    హైదరాబాద్లో లైసెన్స్‌డ్‌ ఆయుధాల కంటే రెండు రెట్లకుపైగా అక్రమ ఆయుధాలు వినియోగంలో ఉన్నట్లు అనధికారిక అంచనా. బీహర్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల నుంచి ఈ ఆయుధాలు సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో తపాంచాలకు పరిమితమైన ఈ ప్రాంతాలు ఇప్పుడు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన గన్స్ ను అక్రమార్కులను సరఫరా చేస్తున్నాయి.

    వెయ్యి నుంచి 20వేల ధరల్లో అత్యాధునిక తుపాకులను తయారీదారులకు అక్రమార్కులకు అందజేస్తున్నారు. ట్రాన్స్ పోర్టు లారీలు, రైళ్లలోనూ హైదరాబాద్ కు నేరుగా ఆయుధాలు సరఫరా అవుతున్నాయని సమాచారం. ఇతర పనుల నిమిత్తం  హైదరాబాద్ కు వచ్చే బీహారీలు గుట్టుచప్పుడు కాకుండా వీటిని అనుకున్న ప్రదేశాలకు చేరవేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

    గన్ కల్చర్ ఇలానే పెరిగితే హైదారాబాద్ బ్రాండ్ దెబ్బతినే అవకాశం ఉందని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు, పోలీసులు రంగంలోగి దిగి అక్రమార్కుల ఆట కట్టించాలని హైదరాబాద్ వాసులు ముక్తకంఠంతో  కోరుతున్నారు.