Crime News: అతడో మానవ మృగంలా మారాడు. సాటి మనిషిని రాక్షసంగా హత్య చేశాడు. కోరిక తీర్చలేదనే ఉద్దేశంతో అత్యంతక్రూరంగా చంపాడు. చేయని పాపానికి ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు. క్షణికావేశమే దీనికి కారణంగా తెలుస్తోంది. మనుషుల్లో కూడా రాక్షసత్వం ఉంటుందని ఈ ఘటన చూస్తే తెలుస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 24 కత్తి పోట్లు పొడవడం అంటే మాటలు కాదు. నిందితుడి చర్యకు అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కోరిక తీర్చలేదనే ఇంత దారుణానికి తెగించడం మానవత్వం కాదు రాక్షసత్వమే.

పొందురు మండలం గోకర్లపల్లికి చెందిన సీపాక మహేశ్ కు ఆముదాలవలసకు చెందిన మహిళతో ఉన్న పరిచయంతో అప్పుడప్పుుడు ఫోన్ చేసేవాడు. ఈ క్రమంలో నిందితుడు ఈ నెల 4న ఆమెకు ఫోన్ చేసి తాను అక్కడికి వస్తున్నట్లు చెప్పాడు. దీంతో ఆమె కూడా రమ్మని ఆహ్వానించింది. దీంతో అతడు పట్టణంలోని మార్కెట్ కమిటీ వద్ద ద్విచక్ర వాహనం నిలిపి ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమెతో పిచ్చాపాటి కబుర్లు చెప్పాడు. అనంతరం తన కామ వాంఛ తీర్చాలని కోరాడు.
దీనికి ఆమె నిరాకరించింది. కానీ బతిమాలాడాడు. ఒక్కసారి తన కోరిక తీర్చాలని ప్రాధేయపడ్డాడు. అయినా ఆమె వినలేదు. అయినా ఆమె ఒప్పుకోకపోవడంతో ఇక లాభం లేదనుకుని ఆమెను కడతేర్చాలని భావించాడు. పక్కనే ఉన్న మిషన్ కత్తెర తీసుకుని ఆమె మెడపై పొడిచాడు. దీంతో ఆమె అరవడంతో చుట్టుపక్కల వారు వస్తారని అనుకుని నోరు మూశాడు. ఇక లాభం లేదనుకుని ఏకంగా వీపు, మెడపై 24 సార్లు పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

ఈ క్రమలో రక్తం అంటడంతో అతడు దుస్తులను కడుక్కుని ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. సాయంత్రం అయినా తిరిగి ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి తలుపు తెరిచి చూసే సరికి ఆమె విగతజీవిగా పడి ఉంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు బండి మీద నుంచి పడ్డానని చెప్పి వైద్యం చేయించుకున్నట్లు విచారణలో తెలిసింది. కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు.