Megastar Chiranjeevi: సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఏపీ సర్కార్ జీవో తెచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగా నిర్ణయం తీసుకున్నారని, థియేటర్ల మనుగడను, ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలన్న సంకల్పాన్ని దృష్టిలో ఉంచుకుని టికెట్ల ధరలు సవరిస్తూ సరికొత్త జీవో జారీ చేశారని కొనియాడారు.
అందుకు సీఎం జగన్ కు చిత్ర పరిశ్రమ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చిరు వెల్లడించారు. అయితే, ఏపీలో 20% చిత్రీకరణ జరుపుకున్న చిత్రాలకే టికెట్ హైక్స్ ఉంటాయని జీవలో పేర్కొన్నారు. RRR, రాధేశ్యామ్ ఏపీలో 20% చిత్రీకరణ జరుపుకోలేదు. దీంతో ఈ రెండు చిత్రాలకి రికార్డు ఓపెనింగ్ కలెక్షన్స్ కష్టమే అని భావించారు. అయితే ప్రస్తుతం వీటికి మినహాయింపు ఇస్తున్నామని, రాబోవు చిత్రాలు తప్పకుండా రూల్‌ని పాటించాలని పేర్ని నాని అన్నారు.
Also Read: భీమ్లానాయక్ ను దెబ్బకొట్టి ‘రాధేశ్యామ్’ ఆర్ఆర్ఆర్ కు ఊరటనిస్తావా జగన్?
కానీ మరోపక్క ఏపీలో సినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవోలో కొన్ని లొసుగులు ఉన్నట్టు పలువురు సినీ వ్యక్తులు అంటున్నారు. మరోవైపు చిరు జగన్‌కి కృతజ్ఞతలు కూడా తెలిపారు. ప్రస్తుతం చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌లో విమెన్స్ డే వేడుకలు సతీసమేతంగా నిర్వహించిన చిరంజీవి, త్వరలోనే ఈ విషయమై మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు.
మరి చిరంజీవికి నిజంగానే జగన్ రిలీజ్ చేసిన జీవో అంత గొప్పగా నచ్చిందా ? లేక, తన ఆచార్య సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి.. చిరు కాంప్రమైజ్ అయ్యాడా ? చూడాలి.
Also Read: స్టార్ హీరోలకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఇవే..!