తెలుగు రియల్టీ షోలలో ‘బిగ్ బాస్’ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. గత సీజన్లకు భిన్నంగా సరికొత్త ప్రయోగాలతో బిగ్ బాస్-4 అలరిస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ నాలుగో సీజన్ సగానికి చేరుకుంది. అయితే ఈ సమయంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి మరో కంటెస్ట్ వైల్ కార్డు ఎంట్రీ ఇస్తాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. బిగ్ బాస్-4 సీజన్ ప్రారంభం ఎపిసోడ్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రస్తుత సీజన్లో సెలబ్రెటీలు ఎవరూ లేకపోవడంతో […]
తెలుగు రియల్టీ షోలలో ‘బిగ్ బాస్’ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. గత సీజన్లకు భిన్నంగా సరికొత్త ప్రయోగాలతో బిగ్ బాస్-4 అలరిస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ నాలుగో సీజన్ సగానికి చేరుకుంది. అయితే ఈ సమయంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి మరో కంటెస్ట్ వైల్ కార్డు ఎంట్రీ ఇస్తాడనే ప్రచారం జోరుగా సాగుతోంది.
బిగ్ బాస్-4 సీజన్ ప్రారంభం ఎపిసోడ్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రస్తుత సీజన్లో సెలబ్రెటీలు ఎవరూ లేకపోవడంతో తొలి మూడువారాలు బిగ్ బాస్ కొంత చప్పగా సాగింది. ఆ తర్వాత కొద్దికొద్దిగా బిగ్ బాస్ మళ్లీ పుంజుకుంది. ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీలను రంగంలోకి దింపాడు. కుమారసాయి.. స్వాతి దీక్షిత్.. ముక్కు అవినాష్ లు బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు.
అయితే వీరిలో ముక్కు అవినాష్ మినహాయించి ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేక బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ అనుకున్నది ఒక్కటైతే జరిగింది మరోకటి. దీంతో బిగ్ బాస్ మరో యాంకర్ ను రంగంలోకి దింపేందుకు యత్నిస్తున్నాడు. బిగ్ బాస్ నుంచి గంగవ్వ సెల్ఫ్ ఎలమినేషన్ కావడంతో ఆమె స్థానంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుందనే టాక్ విన్పిస్తోంది.
స్టార్ యాంకర్.. సింగర్.. తెలంగాణ పిల్ల అయిన మంగ్లీ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనుందట. ఈమేరకు ఆమెతో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే మంగిలి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం పక్కా అని తెలుస్తోంది. గతంలోనే మంగ్లీ పేరు బిగ్ బాస్-4 కంటెస్టెంట్ గా ప్రచారం జరిగింది. అయితే ఆమె బిగ్ బాస్-4లో కన్పించలేదు.
ప్రస్తుత సీజన్లో వైల్డ్ కార్డు ఇచ్చిన వారంతా కొద్దిరోజుల్లోనే తిరుగుముఖం పడుతున్నారు. బిగ్ బాస్ లోని కంటెస్టులంతా వైల్డ్ కార్డు ఎంట్రీలనే టార్గెట్ చేస్తుండటంతో కొన్ని వారాల్లోనే వెనుదిరుగుతున్నారు. దీంతో తెలంగాణ పోరి మంగ్లీ అయినా బిగ్ బాస్ హౌస్ లో కుదురుకుంటుందా? లేదా అనే చర్చ జోరుగా నడుస్తోంది.