రాజనున్న రోజుల్లో వరుసగా పండుగలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఈ కామర్స్ సంస్థలు అనేక ఆఫర్లు ప్రకటించాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రకకాల వస్తువులను అందుబాటులో ఉంచాయి. ఫ్లిప్‌కార్ట్ ఈనెల 16 నుంచి ఆఫర్లను మొదలు పెట్టగా.. శనివారం నుంచి అమెజాన్ ఆఫర్లు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ వస్తువులు ఏ దేశంలో తయారయ్యాయి..? ఎలా తయారయ్యాయి..? అనే సమచారం ప్రొడక్ట్‌పై లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వెంటనే వివరాలు ఇవ్వాలని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలకు నోటీసులు పంపింది. నోటీసులపై స్పందించడానికి 15 రోజలు గడువును విధించింది.