
నిన్న సిడ్నీలో జరిగిన వన్డే మ్యాచ్ లో భారత్ పై ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ఓడిపోవడానికి ఆటగాళ్ల ఫర్ఫార్మెన్స్ లోపమేనని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా క్రీడాకారులకు ఐసీసీ జరిమానా విధించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి టీమిండియా కెప్టెన్ కోహ్లి సైతం అంగీకరించినట్లు సమాచారం. ఆస్ట్రేలియా కేటాయించిన సమయంలో ఓవర్లు పూర్తి చేసిందని పేర్కొంది. కానీ టీమిండియా ప్లేయర్లు కావాలనే సమయాన్ని ఎక్కువగా తీసుకున్నారని తెలిపింది. మొత్తానికి ప్లేయర్ల ఆటతీరు బాగోలేదని వివరించింది.