
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఓవరాల్ గా తగ్గుముఖం పడుతున్నా విద్యాశాఖపై ప్రభావం చూపుతోంది. గతంలో పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా సోకింది. తాజాగా మరో ఇద్దరు ఉపాధ్యాయులకు పాజిటివ్ రిపోర్టు వచ్చింది. గుంటూరు జిల్లా పలుదేవర్లపాడులో కరోనాతో 10 రోజుల వ్యవధిలో ఉపాధ్యాయ దంపతులు మృతి చెందారు. ఈనెల 19న భార్య దుర్గారాణి మరణించగా, నిన్న చికిత్స పొందుతూ భర్త బ్రహ్మనందరాజు కన్నుమూశారు. భార్యభర్తలిద్దూ వినుకొండ మండలంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.