Homeఎంటర్టైన్మెంట్నాగబాబు లెటర్ పై నెటిజన్ల కౌంటర్ !

నాగబాబు లెటర్ పై నెటిజన్ల కౌంటర్ !

Nagababu
విలక్షణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ తాజాగా జ‌న‌సేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ మొత్తానికి బాగానే వైరల్ అవుతున్నాయి. పైగా నాగబాబు ప్రకాష్ రాజ్ మాటలకు కౌంటర్ గా ట్విట్టర్లో లెటర్ పెట్టడంతో ఇది మరింత ముదిరేలా ఉంది. నాగబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. “రాజకీయాల్లో నిర్ణయాలు అనేకసార్లు మారుతుంటాయి. బట్ ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశ్యం లాంగ్ టర్మ్ లో పార్టీకి, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు ఐతే చాలా మంచిది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ ఘంఛ్ ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ ఇచ్చి బీజేపీ గెలుపుకి కృషి చెయ్యటం వెనుక విస్తృత ప్రజా ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలున్నాయని నా నమ్మకం. ఎవడికి కళ్యాణ్ ద్రోహం చేశాడని, ప్రతి పనికిమాలిన వాడు విమర్శిస్తున్నాడు. మిస్టర్ ప్రకాష్ రాజ్ నీ రాజకీయ డొల్లతనం ఏంటో బీజేపీ లీడర్ సుబ్రమణ్యస్వామి డిబేట్లోనే అర్థమైంది,” అంటూ నాగబాబు ప్రకాష్ రాజ్ తన శైలిలో సెటైర్ వేశాడు.

Also Read: స్టార్ హీరోల సినిమాలు పండుగకేనట.. కానీ చిన్న ట్వీస్ట్..!

ఇంతకీ, ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ ఏమిటంటే.. “పవన్ కళ్యాణ్ ఒక ఊసరవెల్లి. 2014 ఎన్నికల్లో బీజేపీ -టీడీపీ కూటమికి ప్రచారం చేశాడు. 2019లో మళ్ళీ ప్లేట్ ఫిరాయించి లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేశాడు. ఇప్పుడు మళ్ళీ మోడీ జపం చేస్తున్నాడు. ఆయనకి ఒక స్థిరత్వం ఉందా? సిద్ధాంతం ఉందా?” అంటూ ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ పై తన అసంతృప్తిని వ్యక్తపరిచాడు. అయితే నాగ‌బాబు చేసిన కామెంట్స్ పట్టుకుని సోష‌ల్ మీడియాలో ఆయ‌న పై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డుతున్నారు నెటిజన్లు. అసలు ప్ర‌కాష్ రాజ్ వ్యాఖ్య‌ల్లో త‌ప్పేముందంటూ పవ‌న్ కళ్యాణ్ పై కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు.

Also Read: అశ్లీలతపై కేంద్రం ఉక్కుపాదం.. ఓటీటీలకు తిప్పలు తప్పవా?

ఆ మాట నిజమేలే.. 2014లో ఎన్‌డిఏ అండ్ టీడీపీల‌కు మద్దతిచ్చిన ఈ జ‌న‌సేనాని, అస‌లు పోటీ చేయకుండా ప్రచారం చేసిన సంగ‌తి ఇంకా ఎవరు మర్చిపోలేదు. పైగా గత ఎన్నికలకు ముందు టీడీపీ అండ్ బీజేపీతో క‌టీఫ్ అయ్యి, క‌రెక్ట్‌గా ఎన్నిక‌ల ముందు లెఫ్ట్ పార్టీలతో జతకట్టి మొత్తానికి ఘోరంగా ఓట‌మిపాలైయాడు. ఇప్పుడు మ‌ళ్ళీ బీజేపీకి మ‌ద్ద‌తు ఇస్తున్నాడు. ప్రత్యేక హోదా కోసం యుద్ధం చేస్తా అన్నాడు. చివరకు ఆ మాట గురించి కూడా మాట్లాడట్లేదు. ఏది ఏమైనా ప‌వ‌న్ ‌ని రంగులు మార్చే ఊస‌ర‌వెల్లి అనడం ఏ మాత్రం తప్పు కాదు అని ప్రకాష్ రాజ్ కి మద్దత్తు బాగానే పెరుగుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular