Mistakes In Romance: శృంగారంలో మజా అనుభవించాలంటే అందులో ఉండే లోపాలను సవరించుకోవాలి. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. అలాగే శృంగార సమస్యలకు కూడా సమాధానాలు దొరుకుతాయి. కాకపోతే కాస్త నిదానంగా ఆలోచించాలి. ఆంగ్లంలో ఓ సామెత ఉన్నట్లు ఎ స్మాల్ కీ ఓపెన్ ద బిగ్ డోర్ అని చెప్పినట్లు శృంగార సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది. శృంగారంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఫలితం బాగుంటుంది. అందుకే శృంగార సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా దృష్టి సారిస్తే కచ్చితంగా పరిష్కారం కనిపిస్తుంది.
శృంగారం రంజుగా సాగకుండా చేయడంలో ఐదు సమస్యలను అధిగమిస్తే శృంగారాన్ని ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే మన జీవితమే మారిపోవచ్చు. శృంగారంలో మొదటి సమస్య ఒత్తిడి. ఒత్తిడి సమస్య ఉంటే ఏదీ మనసున పట్టదు. దీంతో శృంగారానికి కూడా భంగం కలిగే అవకాశం ఉంటుంది. మూడ్ ఉండదు. దీంతో నైరాశ్యం కమ్ముకుంటుంది. ఏదో తెలియని బాధ కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఒత్తిడిని దూరం చేసుకునే క్రమంలో మనం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
నిద్ర లేకపోవడం కూడా ఓ సమస్య కానుంది. నిద్ర లేకపోవడం వల్ల ఒంట్లో శక్తి తగ్గుతుంది. దీంతో శృంగారం పట్ల శ్రద్ధ కూడా ఉండదు. జీవిత భాగస్వామికి కూడా ఇబ్బందే. అందుకే నిద్ర లేకపోవడాన్ని దూరం చేసుకోవాలి. అప్పుడే మనకు శక్తి ఇనుమడిస్తుంది. సంతృప్తికరంగా లేని సెక్స్ తో దంపతుల్లో గొడవలు జరిగే ఆస్కారం ఉంటుంది. దీనికి గాను జీవితాన్ని నందనవనం చేసుకునేందుకు శృంగారంలో ఉన్న సమస్యలను దూరం చేసుకుంటే ఫలితం కచ్చితంగా కనిపిస్తుంది.
అసమతుల్య హార్మోన్లతో కూడా శృంగారాన్ని అనుభవించలేం. దీనికి చికిత్స చేయించుకోవాలి. వైద్యుడిని సంప్రదించి సరైన వైద్యం చేయించుకుని జీవిత భాగస్వామిని సుఖపెట్టేందుకు ప్రయత్నించాలి. అప్పుడే జీవితం సుఖంగా సాగుతుంది. సంసారంలో రోజువారీ గొడవలు ఉండకుండా చూసుకోవాలి. దీంతో కూడా మానసిక స్థైర్యం దెబ్బతింటుంది. ఇంట్లో తరచుగా గొడవలు జరిగితే మన ఆలోచన పక్కదారి పట్టే ప్రమాదం ఉంటుంది. అందుకే శృంగారంలో సంతృప్తి సాధించాలంటే పైన పేర్కొన్న సమస్యలు లేకుండా చూసుకుంటే మంచిది.