Lottery: అదృష్టం ఉండాలే కానీ ఏదైనా మన దరి చేరుతుంది. అదే మనకు ప్రాప్తం లేకపోతే ఎన్ని తంటాలు పడినా కుదరదు. కొన్నిసార్లు అదృష్టం పడిశం పట్టినట్లు పట్టిందని అంటుంటారు. ఈ నేపథ్యంలో డబ్బు సంపాదించాలంటే చాలా కష్టపడాలి. కొందరికి అదృష్టం కలిసొస్తే డబ్బు సులభంగానే వస్తుంది. మరికొందరికి ఎంత కష్టపడినా కలిసి రాకపోవచ్చు. ఎన్ని ప్రయత్నాలు చేసినా దాని ఫలితం వేరేలా ఉండవచ్చు. అన్ని కలిసొస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైనా మన చేతుల్లోని గీతలను కాదు మన చేతలనే నమ్ముకోవాలని పెద్దలు చెబుతుంటారు. కొందరు మాత్రం జ్యోతిష్యం మీద నమ్మకంతో తమకేదో యోగం పడుతుందని నమ్ముతూ కెరీర్ ను నాశనం చేసుకునే వారు సైతం లేకపోలేదు.

అమెరికాలో ఓ లాటరీ టికెట్ కు రూ. 10 వేల కోట్లు రావడం సంచలనం కలిగించింది. కానీ అతడు ఎవరో తెలియడం లేదు. అంతటి అదృష్టాన్ని సొంతం చేసుకున్న అతడి అడ్రస్ మాత్రం కానరావడం లేదు. దీంతో ఆ అదృష్టవంతుడెవరో తెలియడం లేదు. ఏకంగా పదివేల కోట్ల లాటరీ దక్కించుకోవడం మామూలు విషయం కాదు. ఇది ప్రభుత్వ లాటరీ కావడంతో ఇంతవరకు ఎవరికి తగలలేదట. కానీ ఈసారి మాత్రం అతడికి దక్కడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ అతడు ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.
లాటరీలో ఏకంగా 1.28 బిలియన్ డాలర్లు ఇండియన్ కరెన్సీలో రూ.10,136 కోట్లు గెలుచుకోవడం చర్చనీయాంశంగా మారింది. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోని ఓ పెట్రోల్ బంకు వద్ద ఈ టికెట్ అమ్మినట్లు మెగా మిలియన్స్ సంస్థ తెలిపింది. కానీ అతడి అడ్రస్ మాత్రం లేకపోవడంతో అతడెవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇంతవరకు ఈ లాటరీని 29 సార్లు డ్రా తీసిని ఒక్కరికి కూడా లక్ తగలలేదు. కానీ ఈసారి మాత్రం ఆ అదృష్టం ఒకరిని వరించడం అందరిని ఆలోచనలో పడేస్తోంది.
దేశంలోని అతిపెద్ద జాక్ పాట్ లలో ఇది మూడోదని చెబుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో లాటరీ సంపాదించడం అంటే మాటలు కాదు. చెప్పడానికి కూడా మాటలు లేవు. పదివేల కోట్లంటే జీవితాంతం తిన్నా తరగదు. కానీ ఆ అదృష్టవంతుడు మాత్రం ఎవరో కూడా తెలియడం లేదు. దీంతోనే అందరిలో ఉత్కంఠ పెరుగుతోంది. ఆ అదృష్టవంతుడి కోసం వెతుకులాట ప్రారంభమైనా జాడ మాత్రం కానరావడం లేదు. ఇంతకీ అతడు ఎక్కడున్నాడో ఏమో అని అందరు ఎదురు చూస్తుండటం గమనార్హం.