
భార్య చనిపోయినా, విడాకులు తీసుకున్నా భర్త చైల్డ్‌కేర్ లీవ్ తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భర్తలు తమ పిల్లల సంరక్షణ చూసుకోవడానికి లీవులు తీసుకున్నా జీతం వస్తుందని కేంద్రమంత్రి జితేందర్‌సింగ్ తెలిపారు. వీరికి తొలి 365 రోజుల్లో వందశాతం, మరో 365 రోజుల్లో 80 శాతం జీతం వస్తుందన్నారు. అయితే పిల్లలు 22 ఏళ్ల వయసు వచ్చే లోపే ఈ సెలవులు వస్తాయని ఆయన పేర్కొన్నారు. దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులకు ఇది వర్తించదని, దానిని రద్దు చేస్తున్నట్లు చెప్పారు.