young woman Turned Into Men: మన దేశంలో ఎన్నో విచిత్రాలు జరుగుతుంటాయి. ఇద్దరు ఆడవారైనా తమ ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. కానీ ఇద్దరు ఒకే స్వజాతి లింగ జాతులు కావడంతో పెళ్లి చేసుకుంటే ఎదురయ్య సమస్యలపై ఇద్దరు చర్చించుకున్నారు. కానీ వివాహం చేసుకుంటే తరువాత ఎదురయ్య పరిణామాల నేపథ్యంలో ఇద్దరు వారి ముందు వచ్చే ఇబ్బందులపై తర్జనభర్జన పడ్డారు. లింగమార్పిడి చేయించుకుని తన ప్రియురాలి కోరిక తీర్చాలని భావించుకుంది. దీంతో తన శరీరంలోని భాగాలను మార్చుకోవాలని నిర్ణయించుకుంది. శస్త్ర చికిత్స చేయించుకుని లింగమార్పిడి చేయించుకోవాలని సంకల్పించింది.

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ నగరంలో ఇద్దరు యువతులు తమ ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. కానీ ఇద్దరు యువతులు కావడంతో ఎలా అనే ఉద్దేశంతో ఓ యువతి లింగమార్పిడి చేయించుకునేందుకు నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా ఆమె తన కోరిక మేరకు వైద్యుడిని సంప్రదించి శస్త్రచికిత్సకు అవసరమయ్యే విధి విధానాల గురించి తెలుసుకుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి దాదాపు ఏడాదిన్నర సమయం పట్టే అవకాశం ఉంటుందని తెలుసుకుని శస్త్ర చికిత్స ప్రారంభించేందుకు ఉపక్రమించింది. దీంతో ఆమె కోరిక మేరకు ఆమెను అతడుగా మార్చేందుకు వైద్యులు ముందుకు రావడం గమనార్హం.
Also Read: Bheemla Nayak Remake In Hindi: హిందీ లో భీమ్లా నాయక్ రీమేక్.. హీరో ఎవరో తెలుసా??
ప్రయాగ్ రాజ్ నగరంలోని స్వరూప్ రాణి నెహ్రూ ఆస్పత్రి వైద్య బృందం శస్త్ర చికిత్స చేసేందుకు ముందుకు వచ్చింది. దీనికి గాను ఏడాదిన్నర సమయం పడుతుందని చెబుతున్నారు. శస్త్ర చికిత్స ద్వారా యువతి శరీర భాగాలు పూర్తిగా మారిపోనున్నాయి. చాతి, ఇతర భాగాలు పురుషుడిలా మారుతాయని చెబుతున్నారు. సదరు యువతికి అన్ని మగ వారి వంటి లక్షణాలు కూడా వస్తాయి. ఈ క్రమంలో శస్త్ర చికిత్స చేయించుకుని మగవాడిలా మారడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
యువతి యువకుడిగా మారడం ఎంతో మంది నివ్వెరపోతున్నారు. దీనికి గాను 18 నెలల సమయం పట్టనుంది. ఈ మేరకు యువతి యువకుడిగా అవడానికి ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకుని ప్రియురాలు కోసం ప్రియుడుగా మారే విధానం అందరిలో అనుమానాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు అరుదుగానే జరుగుతుంటాయి. కానీ మొత్తానికి యువతి యువకుడిగా మారడంలో ఆమె పడే ఇబ్బందులు లెక్కచేయడం లేదు. శరీర భాగాలన్ని పురుషుడిగా మార్చుకుని ప్రేయసిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Presidential Elections : కాంగ్రెస్ తో కలవడానికి కారణాలు వెతుక్కుంటున్న కేటీఆర్ , కేసీఆర్!