Vegetables Cause Gas Problems: మనం తీసుకునే ఆహారమే మనకు శ్రీరామరక్షగా ఉంటుందని తెలిసిందే. ప్రతి రోజు మనం కడుపులోకి తీసుకునే ఆహారంతోనే మన ఆరోగ్యం ముడి పడి ఉంటుందని అందరికి సుపరిచితమే. కానీ కొందరు మాత్రం సరైన ఆహారం తీసుకోకపోవడంతో పలు సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఫలితంగా బీపీ, షుగర్, గుండెజబ్బులు, థైరాయిడ్ వంటి రోగాల బారిన పడుతూ ఉంటున్నారు. దీంతో ఆహారపు అలవాట్లు సరిగా ఉంచుకోకపోవడంతో పలు సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరికి గ్యాస్ ట్రబుల్ ఉండటంతో వారు కొన్నింటికి దూరంగా ఉండాలని భావిస్తున్నారు. అవేంటో తెలుసుకుంటే మంచిదే.

గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం మనం తినే ఆహారమే అని తెలుసుకోవాలి. కూరగాయల్లో గోబీ గ్యాస్ట్రిక్ సమస్య తెచ్చిపెడుతుంది.శరీరంలో జీర్ణం అయినా తరువాత దీంతో గ్యాస్ సమస్యలు ఎక్కువే అని తెలుసుకుంటే మంచిది. అందుకే గోబీని దూరం పెడితేనే పెడితేనే మేలని చెబుతున్నారు. గ్యాస్ సమస్య ఉన్న వారు దాన్ని వాడకపోవడమే ఆరో్గ్యానికి అన్ని విధాలా మేలు అని తెలుసుకోవాలి. దీంతో గోబీ వంటల్లో వాడకూడదు.

పప్పులు కూడా వాడితే గ్యాస్ సమస్య తలెత్తుతుందని తెలుస్తోంది. ఏ పప్పు అయినా ఆరోగ్యానికి మంచిదే. కానీ గ్యాస్ ట్రబుల్ ఉన్న వారికి కడుపులో గడబిడ తెచ్చిపెడుతుందని తెలుసుకోవాలి. ఏ రకమైన పప్పు అయినా సరే కడుపులో గ్యాస్ కు మూల కారణం అవుతోంది. అందుకే పప్పులు వాడితే అంతే సంగతి. ఈ నేపథ్యంలో పప్పులు వాడకపోవడమే మంచిది. గ్యాస్ సమస్య ఉన్న వారు పప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

జాక్ ఫ్రూట్ తింటే కూడా గ్యాస్ సమస్య వస్తుంది. దీంతో కడుపులో గ్యాస్ వాయువులు ఉత్పత్తి అయి గ్యాస్ట్రిక్ సమస్య ఉత్పన్నమవుతుంది. అందుకే గ్యాస్ సమస్య ఉన్న వారు ఈ పండు తీసుకోకపోవడమే మంచిదని తెలుస్తోంది. గ్యాస్ సమస్య అంత సులువైంది కాదని తెలుసుకుని ఆ సమస్యతో బాధపడే వారు కొన్నింటిని తీసుకోకపోవడమే ఉత్తమమని గుర్తించాలి. జాక్ ఫ్రూట్ ను తక్కువ మొత్తంలో తీసుకుంటేనే సులభమని గ్రహించుకోవాలి.
