24 Marriages In 30 Years: వీడమ్మా బడవా? మూడు పదుల వయసులో 24 పెళ్లిల్లు..ఎలా చేసుకున్నావ్ రా స్వామీ?

24 Marriages In 30 Years: మూడు పదుల వయసులోనే 24 సార్లు ముచ్చట చూసేశాడు ఆ యువకుడు. 28 ఏళ్లకే 24 వివాహాలు చేసుకొని రికార్డు సృష్టించాడు. చిన్న వయసులోనే నిత్య పెళ్లికొడుకుగా మారిపోయాడు. నకిలి ధ్రువపత్రాలు సృష్టించి పెళ్లిచేసుకోవడం..మోజు తీరాక సదరు యువతి వద్ద బంగారం, నగలు దోచుకోవడం అలవాటుపడింది. అయితే ఇప్పటివరకూ 23 మందిని ఈజీగా మోసం చేసిన ఆ యువకుడు 24వ యువతి వద్దకు వచ్చేసరికి ఆయన పప్పులుడక లేదు. పోలీసులకు […]

Written By: Dharma, Updated On : October 1, 2022 2:46 pm
Follow us on

24 Marriages In 30 Years: మూడు పదుల వయసులోనే 24 సార్లు ముచ్చట చూసేశాడు ఆ యువకుడు. 28 ఏళ్లకే 24 వివాహాలు చేసుకొని రికార్డు సృష్టించాడు. చిన్న వయసులోనే నిత్య పెళ్లికొడుకుగా మారిపోయాడు. నకిలి ధ్రువపత్రాలు సృష్టించి పెళ్లిచేసుకోవడం..మోజు తీరాక సదరు యువతి వద్ద బంగారం, నగలు దోచుకోవడం అలవాటుపడింది. అయితే ఇప్పటివరకూ 23 మందిని ఈజీగా మోసం చేసిన ఆ యువకుడు 24వ యువతి వద్దకు వచ్చేసరికి ఆయన పప్పులుడక లేదు. పోలీసులకు ఫిర్యాదుచేసిన సదరు యువతి నిత్య పెళ్లికొడుకును కటకటలా వెనుకకు పంపించింది. పశ్చిమబెంగాల్ లో వెలుగుచూసిన ఘటన సంచలనం రేకెత్తించింది. చర్చనీయాంశంగా మారింది.

24 Marriages In 30 Years

అసాబుల్ మొల్ల అనే యువకుడికి 28 ఏళ్లు ఉంటాయి. చూడడానికి చక్కగా ఉంటాడు. ఆపై మాటలతో బురిడీ కొట్టించగల నేర్పరి. పైగా చదువుకున్నవాడు. అయితే ఆ తెలివితేటలను ఉద్యోగానికో లేక ఉపాధి కో చూపించలేకపోయాడు. మోసగించడం అలవాటు చేసుకున్నాడు. డబ్బులున్న అందమైన యువతులను టార్గెట్ చేసుకునేవాడు. నకిలీ ధ్రువపత్రాలతో తనకు తాను పరిచయం చేసుకునేవాడు. కుటుంబ నేపథ్యం, మంచి చదువు, ఉద్యోగం ఉందని నమ్మబలికేవాడు. యువతులను నమ్మించేవాడు. వారికి వివాహానికి ఒప్పించాడు. వివాహం జరిగి మూడు రాత్రులు పూర్తయిన తరువాత ప్రతాపంచూపేవాడు. వారి వద్ద బంగారం, నగదు పట్టుకొని ఉడాయించేవాడు.

తాజాగా బెంగాల్ లోని సాగర్ దిగీ ప్రాంతానికి చెందిన యువతిని కూడా మోసగించి పెళ్లి చేసుకున్నాడు. కొద్దిరోజులకే పరారయ్యాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో వారు రంగంలోకి దిగారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఇప్పటివరకూ అసాబుల్ 23 మందిని పెళ్లి చేసుకున్నాడని తెలియడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. పశ్చిమబెంగాల్, బిహార్ ప్రాంతాల్లో యువతులను వివాహం చేసుకున్నట్టు అసాబుల్ అంగీకరించాడు. అయితే ఈయన చేతిలో మోసపోయిన వారి వివరాలను ఆరాతీసే పనిలో పడ్డారు పోలీసులు.

Tags