YCP- PFI: పీఎఫ్ఐ.. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా.. దేశంలోని వివిధప్రాంతాల్లో స్థానికులతో కలిసి పోయి అద్దెకు తీసుకొని ఉంటున్న ఈ గ్రూపు సభ్యులు విద్వేశాలు రెచ్చగొడుతున్నారని.. ముస్లిం యువతను ఉగ్రవాదులుగా మారుస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవల ఎన్ఐఏ దేశవ్యాప్తంగా దాడులు చేసి పలువురిని అరెస్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ దాడులు సాగాయి. నిజామాబాద్, నెల్లూరు జిల్లాల్లో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. దేశంలో ‘పీఎఫ్ఐ’పై నిషేధం విధించి కేంద్ర సర్కార్ షాక్ ఇచ్చింది.

పీఎఫ్ఐ అంటే బీజేపీ సర్కార్ విరుచుకుపడుతోంది. మరి అలాంటి పీఎఫ్ఐతో ఏపీలోని అధికార పార్టీ వైసీపీని పోల్చాడు బీజేపీ సీనియర్ నేత డా.లక్ష్మణ్. తెలిసి అన్నాడో.. తెలియకుండా అన్నాడో కానీ లక్ష్మణ్ చేసిన విమర్శ మాత్రం వైరల్ అయ్యింది. ఏపీలో అధికార వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
అభివృద్ధి లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ ఏపీ ప్రజలను మభ్య పెడుతున్నాడని ఆరోపించారు. రాజధాని అటకెక్కించారని.. అమరావతి రైతులపై కత్తి కట్టారన్నారు. తెలంగాణ, ఏపీలో కుటుంబ పాలనలు కొనసాగుతున్నాయన్నారు.. ముఖ్యమంత్రి జగన్ వైఖరి వల్లే విభజన చట్టం నీరుగారిపోతోందన్నారు. పథకాలకు పేర్లు మార్చి కేంద్రం ఇచ్చే ప్రభుత్వ నిధులను దారి మళ్లిస్తున్నారన్నారని విమర్శించారు.

ఈ క్రమంలోనే ‘పీఎఫ్ఐ’ని వైసీపీతో పోల్చారు. ఈ రెండూ పార్టీలు మీద పడిపోతాయని.. ప్రతిపక్షాలపై దాడులతో రెచ్చిపోతాయని.. దానికి దీనికి పోలిక ఏం లేదంటూ విమర్శలు గుప్పించారు.
ఏపీలోని అధికార వైసీపీని విద్వేశాలు రెచ్చగొట్టే ఉగ్రవాద గ్రూపుతో పోల్చడమే వివాదాస్పదమైంది. లక్ష్మణ్ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఇది కరెక్ట్ కాదని.. అలాంటి మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇక వైసీపీని పీఎఫ్ఐతో పోల్చిన లక్ష్మన్ డైలాగ్స్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. బీజేపీ పెద్దలు ఇలా వైసీపీని చూస్తారంటూ ఏద్దేవా చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.