https://oktelugu.com/

NBK 107 Movie: తోకలు వద్దయ్యా బాబు.. బాలయ్య కేకలు !

NBK 107 Movie: నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో తన 107వ సినిమాని భారీ స్థాయిలో చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ను మొదట ‘వీరసింహరెడ్డి’గా ఫిక్స్ చేశారు. ఐతే, ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల టాక్ ప్రకారం.. టైటిల్ లో ‘రెడ్డి’ అనే తోక వద్దు అంటున్నాడు బాలయ్య. కానీ, టైటిల్ పవర్ ఫుల్ గా ఉండాలి అంటే రెడ్డి అనే తోక ఉండాలని ఫీల్ అవుతున్నాడు దర్శకుడు. గతంలో బాలయ్య […]

Written By:
  • Shiva
  • , Updated On : March 2, 2022 / 05:25 PM IST
    Follow us on

    NBK 107 Movie: నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో తన 107వ సినిమాని భారీ స్థాయిలో చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ను మొదట ‘వీరసింహరెడ్డి’గా ఫిక్స్ చేశారు. ఐతే, ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల టాక్ ప్రకారం.. టైటిల్ లో ‘రెడ్డి’ అనే తోక వద్దు అంటున్నాడు బాలయ్య. కానీ, టైటిల్ పవర్ ఫుల్ గా ఉండాలి అంటే రెడ్డి అనే తోక ఉండాలని ఫీల్ అవుతున్నాడు దర్శకుడు.

    NBK 107 Movie

    గతంలో బాలయ్య ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ వంటి తోకలు ఉన్న టైటిల్స్ తో సూపర్ హిట్లు కొట్టాడు. కాకపోతే, బాలయ్య మాత్రం ఈ సారి కులం తోకలు లేని టైటిలే పెట్టాలని సీరియస్ గా డిసైడ్ అయ్యాడు. ఎలాగూ ‘సింహా’ అనే టైటిల్ తో బాలయ్యకు ఎప్పటినుంచో హిట్ సెంటిమెంట్ వుంది. బాలకృష్ణ కెరీర్ లో ‘సింహా’ అనే టైటిల్స్ తో వచ్చిన అన్నీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా ఆడాయి.

    Balakrishna and Gopichand Malineni

    ఎలాగూ ‘వీరసింహా రెడ్డి’లో సింహా ఉంది కాబట్టి.. ఇక రెడ్డి అనే తోక లేకపోయినా పొయ్యేది ఏమి లేదు అని బాలయ్య గోపీచంద్ మలినేనికి సూచిస్తున్నాడట. ఇక మొదటి షెడ్యూల్ లో రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో బాలయ్య పై యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వెన్స్ లో బాలయ్య లుంగీలో ఊర మాస్ లుక్‌ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా కథ మొత్తం రాయలసీమ – కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో జరుగుతుంది.

    Also Read: ‘ఈటీ’ ట్రైలర్ తో ఆకట్టుకున్న సూర్య.. మరి ప్రభాస్ ను తట్టుకునేది ఎలా ?

    కథలో రాయలసీమకు చెందిన ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించ బోతున్నారు. ముఖ్యంగా రాయలసీమకి సాగునీటి విషయంలో జరుగుతున్న ఆన్యాయాన్ని సినిమాలో ప్రధానంగా చూపిస్తారట. ఇక బాలయ్యకి జోడీగా శ్రుతి హాసన్ నటించబోతుంది. ఈ సినిమాలో తన పాత్ర కోసం చాలా కసరత్తులు చేస్తోంది. లావు పెరగడానికి తన డైట్ ను మార్చుకుంది.

    నిజానికి శృతి హాసన్ కి జీరో సైజ్ అంటేనే ఎక్కువ మక్కువ. కానీ బాలయ్య సినిమా కోసం పూర్తిగా వర్కౌట్స్ మానేసింది. సరికొత్త లుక్ లో కనిపించబోతుంది. ఈ సినిమాలో ఆమెది ఒక సాధారణ హౌస్ వైఫ్ పాత్ర. ఏది ఏమైనా అరవై ఏళ్ల వయసులో బాలయ్య క్రేజ్ డబుల్ అయింది. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లు అంతా బాలయ్యతో సినిమా అనగానే మొహం చాటేసేవాళ్ళు. ఇప్పుడు బాలయ్య డేట్లు కోసం పడిగాపులు కాస్తున్నారు.

    Also Read: సోనాక్షిసిన్హాతో సల్మాన్ ఖాన్ రహస్య పెళ్లి.. పెళ్లి ఫొటోపై అసలు నిజాలు ఇవీ!

    Tags