హిందూ మతంలో ప్రాముఖ్యత ఉన్న చెట్లలో మర్రి చెట్టు ఒకటి. మర్రి చెట్టు అన్ని రకాల కోరికలను నెరవేర్చడంతో పాటు ఇంట్లో తూర్పు దిశలో ఈ చెట్టు ఉండే శుభప్రదం అని వాస్తు నిపుణులు వెల్లడిస్తున్నారు. దేవతల నివాసంగా చెప్పుకునే పీపాల్ చెట్టు ఇంట్లో పడమర దిక్కున ఉంటే మంచిది. వాస్తు ప్రకారం ఈ చెట్టును పడమర దిక్కున నాటాలని నిపుణులు చెబుతున్నారు. ఇంటి లోపల వాస్తు ప్రకారం పండ్ల చెట్లను పెంచుకోకూడదనే సంగతి తెలిసిందే.
వాస్తు ప్రకారం ఉసిరి చెట్టును ఈశాన్య మూలలో నాటితే మంచిది. బేల్ చెట్టును మాత్రం ఇంట్లో పశ్చిమ దిశలో నాటాలి. శివుని పూజలో బేల్ చెట్టు ఆకులు, పండ్లను ఉపయోగించడం జరుగుతుంది. బేల్ చెట్టు నీడ చల్లగా ఉండటంతో పాటు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటి ఆగ్నేయ దిశలో చింతపండు మొక్కను నాటితే మంచిదని పెద్దలు చెబుతున్నారు. ఇంటి బయట దానిమ్మ చెట్టును ఆగ్నేయ దిశలో నాటితే మంచిది.
రక్త సంబంధిత రుగ్మతలకు చెక్ పెట్టడంలో దానిమ్మ చెట్టు తోడ్పడుతుంది. మధుమేహం, గుండె రోగులకు నేరేడు పండు దివ్యుషధంగా పని చేస్తుంది. దక్షిణ లేదా నైరుతి మధ్యలో నేరేడు నాటితే మంచి ఫలితాలు ఉంటాయి. మానవుడికి అత్యంత అవసరమైన పండ్లలో మామిడి పండు ఒకటి. మామిడి కలప, పండ్లు, విత్తనాలు, ఆకులు మంచిది. ఇంటికి తూర్పు లేదా ఉత్తరంలో మామిడి చెట్టు ఉంటే మంచిదని వాస్తు నిపుణులు వెల్లడిస్తున్నారు.