Hurricane Ida: అగ్రరాజ్యం అమెరికా వరుస ఉపద్రవాలతో అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే అప్ఘనిస్తాన్ లో యుద్ధాన్ని అర్థాంతరంగా ముగించి ఆ దేశాన్ని తాలిబన్ల వశం చేసి విమర్శల పాలైన అమెరికాపై తాజాగా ఇడా తుఫాన్ విరుచుకుపడింది. అమెరికా చరిత్రలోనే తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అమెరికా ఆర్థిక రాజధానిగా పేరున్న న్యూయార్క్ అతలాకుతలమైంది. ఊహకు అందని స్థాయిలో వరద బీభత్సం ముంచెత్తింది. భయానక పరిస్థితులను చవిచూస్తోంది.
ఇడా హరికేన్ (Hurricane Ida) సృష్టించిన బీభత్సం తీవ్ర విషాదం నింపింది. ఇడా హరికేన్ ధాటికి ఏకధాటిగా కురిసిన వర్షంతో న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాలు మునిగిపోయాయి. హఠాత్తుగా సంభవించిన వరదలు ఈ రెండు రాష్ట్రాల్లో కల్లోల పరిస్థితులకు దారితీశాయి. ఈ వరదల్లో దాదాపు 41 మంది మరణించినట్లు సమాచారం. మృతుల్లో చిన్నారులు కూడా ఉండడం విషాదం నింపింది.
ఇడా హరికేన్ విరుచుకుపడడంతో న్యూయార్క్, న్యూజెర్సీల్లో ఏకధాటిగా అతి భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ నదులను తలపించాయి. ఫ్లాష్ ఫ్లడ్ ఎమర్జెన్సీ హెచ్చరికలను జారీ చేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో న్యూయార్క్ విమానాశ్రయాన్ని మూసివేశారు.
న్యూయార్క్ సిటీ సబ్ వే లైన్లన్నీ భారీ వర్షాలకు మునగడంతో మునిగిపోయాయి. దీంతో వాటన్నింటిని మూసివేసిన పరిస్థితి నెలకొంది. న్యూయార్క్, న్యూజెర్సీ బ్రాంక్స్ క్వీన్స్ నగరాల్లో రోడ్లపై పార్క్ చేసిన కార్లు పడవల్లా కొట్టుకుపోయాయి. దాదాపు 41 మంది చనిపోగా.. ఎక్కువమంది వాహనాల్లో చిక్కుకుపోయి కొట్టుకుపోయి నీట మునిగి చనిపోయిన వారే ఉన్నారు. అపార్ట్ మెంట్ బేస్ మెంట్లలోకి వరద పోటెత్తి అందులో చిక్కుకొని చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. గంట వ్యవధిలోనే 12 సెం.మీల వర్షం పపడంతో రెండు రాష్ట్రాలు మునిగిపోయాయి. న్యూయార్క్ సెంట్రల్ పార్క్ లో గంటలో 80 సెంటీ మీటర్ల వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో మొత్తం మునిగిపోయిన పరిస్థితి నెలకొంది..
భారీ వర్షంతో న్యూయార్క్, న్యూజెర్సీ పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో కరెంట్ కోత ఏర్పడి అంధకారం నెలకొంది. దీంతో అమెరికా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ప్రజలకు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.
ఇక వర్షానికి తోడు టోర్నడోలు బీభత్సాన్ని సృష్టించాయి. గరిష్ట వేగంతో వచ్చిన ఇవి చెట్లను, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు, ఇళ్లను పెకిలించి గాలికి ఎగురేసుకొని పోయాయి. ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.
పోలీసులు అపార్ట్ మెంట్లలో మునిగిపోయిన వారిని రక్షిస్తున్నారు. వాహనాల్లో వరదల్లో బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. కొట్టుకొచ్చిన వాహనాల్లో కొన్ని మృతదేహాలు లభించాయి. బయట ఎవరూ తిరగవద్దని ఈ రాష్ట్రాల్లో హెచ్చరికలు జారీ చేశారు.
This is north of NYC, Central Park Av in Scarsdale#NYCFlooding #NewJersey #flooding
#NY #NYC #NewYorkCity #Ida #HurricaneIda #NJwx #flashflooding #Emergency #tornadowarnings pic.twitter.com/CUa5RXGyXo— Chaudhary Parvez (@ChaudharyParvez) September 2, 2021
Flooding and torrential rain pound the Northeast U.S. as remnants of Hurricane Ida travel up the coast.
The @NWS has issued a Flash Flood Emergency for New York City and Northeast New Jersey https://t.co/dy5g7trvuF #HurricaneIda pic.twitter.com/OQuh5SZDJY— Bloomberg Quicktake (@Quicktake) September 2, 2021