Homeపండుగ వైభవంAshadam Masam: ఆషాడంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలో మీకు తెలుసా?

Ashadam Masam: ఆషాడంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలో మీకు తెలుసా?

Ashadam Masam: ఆషాడ మాసం రాగానే మహిళల్లో చాలామంది గోరింటాకు పెట్టుకుంటారు. మిగతా రోజుల్లో గోరింటాకు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా ఆషాడంలో కాళ్లు, చేతులకు గోరింటాకు పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల అందంగా కనిపించడంతో పాటు ఎన్నో లాభాలను పొందవచ్చు. సాధారణంగా ఆషాడంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయనే సంగతి తెలిసిందే. వాతావరణంలో మార్పుల వల్ల ఆషాడంలో సూక్ష్మ క్రిములు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.

Ashadam Masam
Gorintaku

వర్షాలు ఎక్కువగా పడటం వల్ల బయట వాతావరణం చల్లగా ఉన్నా శరీరంలో మాత్రం వేడిగా ఉంటుంది. అందువల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆడవాళ్లు గోళ్ల దెబ్బ తింటే ఆ సమస్యలు దూరమవుతాయి. సాధారణంగా ఆడవాళ్లు సర్ఫ్, డిజర్జెంట్ లను ఎక్కువగా వినియోగిస్తారనే సంగతి తెలిసిందే.

Also Read: Thank You Movie Collections: ‘థాంక్యూ’ 4 డేస్ కలెక్షన్స్.. ఏ ఏరియాలో ఎన్ని కోట్లు వచ్చాయంటే ?

సర్ఫ్, డిటర్జెంట్ వినియోగించడం వల్ల ఆడవాళ్ల గోళ్లలో నీళ్లు చేరే అవకాశం ఉంటుంది. గోరింటాకు పెట్టుకుంటే ఆ సమస్యలు అన్నీ దూరమవుతాయి. గోరింటాకు ఒంట్లోని వేడిని చల్లబరిచి కఫ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది. గోరింటాకు కాకుండా కోన్లు వాడితే అందులో ఉపయోగించే రసాయనాల వల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది.

ఆషాడంలో పుష్కలంగా లభించే గోరింటాకును తీసుకుంటే మాత్రమే మంచిదని చెప్పవచ్చు. అందువల్ల గోరింటాకుకు ప్రాధాన్యత ఇస్తేనే మంచిది. గోరింటాకులో నిమ్మరసం, చింతపండు వేయడం ద్వారా గోరింటాకు మరింత ఎర్రగా పండే అవకాశాలు అయితే ఉంటాయి.

Also Read: Sita Ramam Movie Trailer: ట్రైలర్ టాక్ : ప్రేమతో రాసిన ప్రేమ‌క‌థ ‘సీతా రామం’.. ట్రైలర్ కేక !
Recommended Videos
మొత్తానికి పెళ్లి పీటలు ఎక్కబోతున్నఅనుష్క || Anushka Setty Marriage News Goes Viral || Prabhas
పవర్ స్టార్ ని మించిన హీరో ఇండస్ట్రీ లో లేడు  || Bheemla Nayak Set All Time Record || Pawan Kalyan

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version